News May 10, 2024
వాట్సాప్ కొత్త లుక్ వచ్చేసింది!

IOS, ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ కొత్త లుక్ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఇంటర్ఫేస్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. యాప్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇంటర్ ఫేస్ షేప్, కలర్, ఐకాన్స్, బటన్స్ డిజైన్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. యూజర్ల కళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు, టెక్స్ట్ను సులభంగా చదివేందుకు వీలుగా డార్క్ మోడ్ను తీసుకొచ్చినట్లు వివరించింది.
Similar News
News January 31, 2026
కశ్మీర్లో ఉగ్రవాదులతో భీకర పోరు

JKలోని కిష్తవార్ జిల్లా దోల్గాంలో శనివారం తెల్లవారుజామున భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్కౌంటర్ మొదలైంది. జనవరి 18న మొదలైన ఆపరేషన్ త్రాషి-Iలో భాగంగా భారత ఆర్మీ, JK పోలీసులు, CRPF సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడే నక్కిన ముగ్గురు జైషే ఉగ్రవాదులు బలగాలకు తారసపడ్డారు. వారు కాల్పులు జరపటంతో.. బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.
News January 31, 2026
నేటితో ముగియనున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19 నుంచి ప్రారంభమైన ఉచిత పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమం నేటితో ముగియనుంది. 13,257 గ్రామాల్లో శిబిరాలను ఏర్పాటు చేసి పశు వైద్య చికిత్సలు, నట్టల నివారణ మందులు, వ్యాధి నిరోధక టీకాలను అందించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. పాడిరైతులకు పశు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికీ పశువులకు టీకాలు వేయించకుంటే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి.
News January 31, 2026
ధనవంతులు కావాలంటే..?

ధనవంతులు కావాలనే తపన అందరిలో ఉంటుంది. కానీ అందుకు అదృష్టం కూడా తోడవాలి. ఆధ్యాత్మికంగా ధనాకర్షణ పెరగాలంటే తోటివారికి సాయం చేయడం, దానం చేయడం ఉత్తమం. పర్సులో ఎప్పుడూ కొంత నగదు ఉంచుకోవడం, దగ్గర డబ్బులు పెట్టడం వల్ల సంపద శక్తి పెరుగుతుంది. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సానుకూలత లభిస్తుంది. అయితే, ఈ మార్గాలన్నీ ఇంజిన్కు పెట్రోల్ వంటివి మాత్రమే. లక్ష్యాన్ని చేరడానికి మీ నిరంతర కృషే అసలైన వాహనం.


