News January 1, 2025

వాట్సాప్ వేదికగా ఎక్కువగా సైబర్ నేరాలు: రిపోర్ట్

image

దేశంలో ఎక్కువగా సైబర్ నేరాలు వాట్సాప్ వేదికగా జరిగినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. గత ఏడాది తొలి మూడు నెలల్లో వాట్సాప్‌పై 43,797 ఫిర్యాదులు రాగా ఆ తర్వాత టెలిగ్రామ్(22,680), ఇన్‌స్టాగ్రామ్(19,800)పై వచ్చాయని వెల్లడించింది. గూగుల్ సర్వీస్ ప్లాట్‌ఫామ్‌లను ఈ మోసాలకు ఉపయోగించారని తెలిపింది. నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారంది.

Similar News

News February 5, 2025

WORLD RECORD: ఒంగోలు జాతి ఆవు ధర రూ.41 కోట్లు

image

సాధారణంగా ఆవు ధర వేలల్లో, కాస్త పాలు ఎక్కువగా ఇచ్చే రకమైతే రూ.1-2 లక్షలు ఉంటుంది. అయితే ఒంగోలు/నెల్లూరు బ్రీడ్‌కు చెందిన వయాటినా-19 అనే ఆవు జ్రెజిల్‌లో నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.41 కోట్లకు అమ్ముడైంది. దీంతో గతంలో ఉన్న రికార్డులన్నీ బ్రేకయ్యాయి. కాగా 1800sలో ఒంగోలు ఆవును బ్రెజిల్‌కు తీసుకెళ్లారు. అక్కడ అనేక జెనెటిక్ మార్పులతో ప్రాచుర్యం పొందింది. వయాటినా-19 బరువు ఏకంగా 1,101kgలు.

News February 5, 2025

చికెన్ తినడానికి భయపడుతున్నారా?

image

APలోని కొన్నిచోట్ల కోళ్లు చనిపోతున్న <<15366175>>ఘటనలపై <<>>పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. ఈ ఘటనలతో కోళ్లు, గుడ్లు తినేందుకు ప్రజలు సంకోచిస్తుండటంతో వీటి వినియోగం వల్ల అనారోగ్యం సంభవించినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ప్రజలు అపోహలకు గురికావొద్దని, ఉడికించిన గుడ్లు, చికెన్ తీసుకోవచ్చని సూచించారు. కొల్లేరు సరస్సుకు ఈ ఏడాది వలస పక్షులు అధికంగా రావడం కూడా ఆ సమీపంలో కోళ్ల మృతికి కారణంగా భావిస్తున్నారు.

News February 5, 2025

ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్!

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ గాయం కారణంగా అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు తెలిపాయి. మరో వైపు హజిల్‌వుడ్ తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. కమిన్స్ స్థానంలో స్మిత్ లేదా హెడ్ సారథ్య బాధ్యతలు స్వీకరించే అవకాశమున్నట్లు సమాచారం. జట్టు మేనేజ్మెంట్ నుంచి ఈ విషయమై ప్రకటన రావాల్సి ఉంది.

error: Content is protected !!