News April 4, 2024
వాట్సాప్ పని చేయడం లేదు!

ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ డౌన్ అయింది. మెసేజెస్ వెళ్లడం లేదని, ఇతర సేవలు పని చేయడం లేదని ట్విటర్ వేదికగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో వాట్సాప్ డౌన్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సర్వర్స్లో ఇష్యూ కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం యాప్ వర్క్ అవుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News January 15, 2026
ఓల్డ్ సిటీ మెట్రో ముచ్చట.. ఇల్లు పోయినా ‘పై అంతస్తు’ ఆశ!

దారుల్షిఫా నుంచి చాంద్రాయణగుట్ట దాకా సుమారు 450 ఇళ్లు, షాపులను కూల్చేయడానికి సర్కారు మార్కింగ్ ఇచ్చేంది. ఇల్లు పోతుందని బాధపడే వాళ్ల కోసం ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. ఇల్లు కొంచెం పోయినా పైన రెండు అంతస్తులు ఎక్స్ట్రా కట్టుకోవడానికి ఫ్రీగా పర్మిషన్ ఇస్తారట. ఇక L&T, ప్రభుత్వానికి మధ్య జరిగిన డీల్ చూస్తే మతిపోవాల్సిందే. అప్పులన్నీ ప్రభుత్వం నెత్తిన, మెట్రో మాల్స్ మీద వచ్చే లాభాలు ఆ కంపెనీ తీసుకుంటుందట.
News January 15, 2026
ఎన్టీఆర్ అదిరిపోయే లుక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదిరిపోయే లుక్లో దర్శనమిచ్చారు. బియర్డ్ లుక్లో సూపర్బ్ స్టైలిష్గా కనిపించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం ఆయన భారీగా గడ్డం పెంచారు. తాజాగా కారులో నుంచి దిగి నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను పలువురు SMలో షేర్ చేశారు. తారక్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
News January 15, 2026
ఫోన్ ఎత్తుకెళ్లిన బెంగాల్ సీఎం.. సుప్రీంకోర్టులో ఈడీ

వెస్ట్ బెంగాల్ ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టులో వాడీవేడీగా విచారణ జరిగింది. సోదాల సమయంలో WB సీఎం మమతా తమ ఫోన్ను ఎత్తుకెళ్లినట్లు ఈడీ అధికారులు SCకి తెలియజేశారు. మనీలాండరింగ్ విషయమై సోదాల గురించి ముందే స్థానిక PSకు సమాచారమిచ్చినా పోలీసులతో మమతా తమ సోదాలకు అంతరాయం కలిగించారన్నారు. అటు పోలీసులను మమత నియంత్రించడం తీవ్రమైన అంశంగా సుప్రీంకోర్టు పరిగణించింది.


