News October 25, 2024
ఆ రైతుల కోసం వాట్సాప్ సేవలు: మంత్రి తుమ్మల

TG: పత్తి రైతులకు అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ సేవలను ప్రారంభించింది. 8897281111 నంబరు ద్వారా కొనుగోళ్లు, అమ్మకం, అర్హత, తదితర వివరాలను రైతులు ఇంటి వద్ద ఉండే తెలుసుకోవచ్చని మంత్రి తుమ్మల తెలిపారు. అంతేకాకుండా రైతులు ఎలాంటి ఫిర్యాదు చేసినా మార్కెటింగ్ శాఖ సత్వరమే చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
Similar News
News January 29, 2026
కరుంగలి మాల ఎందుకు ధరించాలంటే…?

కరుంగలి మాల ఆభరణమే కాదు! శక్తిమంతమైన రక్షణ కవచం కూడా. ఇది ప్రతికూల శక్తులను, చెడు దృష్టిని దరిచేరనీయదు. కుజ దోషం ఉన్నవారు దీనిని ధరిస్తే ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. మానసిక ఒత్తిడి, భయం, సోమరితనాన్ని తగ్గించి మనశ్శాంతి ప్రసాదిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునే వారు, ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొంటున్నవారు ఈ పవిత్రమైన మాలను ధరించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారని సిద్ధ సంప్రదాయం చెబుతోంది.
News January 29, 2026
రెండు రోజుల లాభాలకు బ్రేక్

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ రెండు రోజుల లాభాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో మొదలయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా కోల్పోయి 82,093 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు నష్టపోయి 25,274 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడమూ భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
News January 29, 2026
వడ్డీ రేట్లు యథాతథం: US FED

వడ్డీ రేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది. 3.5%-3.75%గా ఉన్న వడ్డీరేట్లను అలాగే కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు.


