News April 16, 2024

వాట్సాప్‌: త్వరలో సూపర్ ఫీచర్

image

వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురానుంది. రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో ఉన్నవారి లిస్టు ఒకే చోట కనిపించేలా ఆప్షన్‌ను కల్పించనుంది. ఇందులో మనకు ముఖ్యమైన వారి నంబర్లను యాడ్ చేసుకోవచ్చు. అయితే వినియోగదారుల గోప్యత దృష్ట్యా వారి లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్‌లు కనిపించబోవని సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆ ఆప్షన్ కొందరు బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చిందని, త్వరలోనే అందరూ ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.

Similar News

News February 2, 2026

వేరుశనగలో అంతర పంటలతో లాభాలేంటి?

image

వర్షాభావ పరిస్థితులు, బెట్ట, కరవు పరిస్థితులు ఏర్పడి ప్రధాన పంట అయిన వేరుశనగ నష్టపోయినా.. అంతర పంటల నుంచి కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వేరుశనగ, అంతరపంటల వేరువ్యవస్థ పొడవులో తేడాల వల్ల భూమిలోని పోషకాలు, నీటిని పంటలు సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంటుంది. చీడపీడల ఉనికి చాలావరకు తగ్గుతుంది. వర్షపునీటిని పొలంలోనే ఇంకేటట్లు చేయడంలో, నేలకోతను నివారించడంలో అంతరపంటలు కీలకపాత్ర పోషిస్తాయి.

News February 2, 2026

ఏ గ్రహానికి ఏ నైవేద్యం సమర్పిస్తే శుభం?

image

ఆదిత్యుడు – గోధుమలు, రవ్వ చక్కెర పొంగి
చంద్రుడు – పెరుగన్నం
అంగారకుడు – కందిపప్పు అన్నం
బుధుడు – పెసరపప్పు అన్నం
గురు – సెనగపప్పు అన్నం
శుక్రుడు – చిక్కుడు గింజల అన్నం
శని – నల్లని నువ్వులు కలిపిన అన్నం
రాహువు – మినుములతో కూడిన అన్నం
కేతువు – ఉలవల అన్నం

News February 2, 2026

WPL: ఢిల్లీ కల సాకారమయ్యేనా!

image

మహిళా ప్రీమియర్ లీగ్(WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టు స్థిరమైన ప్రదర్శనతో కొనసాగుతోంది. వరుసగా నాలుగు సీజన్లలో ప్లేఆఫ్ చేరిన జట్టుగా DC నిలిచింది. గత మూడు సీజన్లలో ఫైనల్ వరకు వెళ్లింది. రేపు గుజరాత్ జెయింట్స్‌తో జరిగే ఎలిమినేటర్‌లో విజయం సాధిస్తే వరుసగా నాలుగు సార్లు ఫైనల్ చేరిన జట్టుగానూ నిలవనుంది. ఫైనల్లో ఆర్సీబీపై గెలిస్తే తొలి సారి విజేతగా నిలవాలనే కల సాకారం కానుంది.