News March 26, 2025
ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

TG: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. ఇప్పటికే కొన్ని పేపర్ల వాల్యుయేషన్ ప్రారంభమైంది. అన్ని పేపర్లు మూల్యాంకనం చేసిన తర్వాత ఏప్రిల్ 4వ వారంలో ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. వచ్చే నెల 29న ఎప్సెట్ ఉండటంతో దానికి 2, 3 రోజులు ముందుగానే రిజల్ట్స్ రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది ఇంటర్ పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే.
Similar News
News March 29, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు వరుసగా నాలుగవ రోజూ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 పెరిగి రూ.83,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 పెరగడంతో రూ.91,200 వద్ద కొనసాగుతోంది. అటు వెండి మాత్రం రూ.1000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,13,000గా ఉంది.
News March 29, 2025
రూ.వందల కోట్లు పోగొట్టుకున్నాం.. రూ.35లక్షల ఆరోపణలా?: కడప మేయర్

AP: కడప MLA మాధవిపై మేయర్ సురేశ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు మారుతూ పబ్బం గడిపే వారు తనపై నిందలేయడం విడ్దూరంగా ఉందన్నారు. ప్రజా సేవలో తమ కుటుంబం రూ.వందల కోట్లు పోగొట్టుకుందని, అలాంటిది కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు తనపై కేవలం రూ.35 లక్షల ఆరోపణలా? అని ధ్వజమెత్తారు. అక్రమాలకు పాల్పడిన వారే నిందలేస్తారా? అని మండిపడ్డారు. 3దశాబ్దాలుగా సేవ చేశామే తప్ప రాజకీయ లబ్ధి పొందలేదన్నారు.
News March 29, 2025
ఆ నీటిని వాడొద్దు.. చాలా ప్రమాదకరం!

ఎండాకాలం వచ్చేసింది. నీటి ఎద్దడి ప్రారంభమైంది. దీంతో చాలా చోట్ల, ముఖ్యంగా నగరాల్లో డ్రమ్ముల్లో నీటిని నిల్వ చేసి అవే వాడుకుంటుంటారు. ఇది చాలా ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘క్రిములు పుట్టేది, కీటకాలు గుడ్లు పెట్టేది నిల్వ నీటిలోనే. రోజుల తరబడి స్టోర్ చేసిన నీటిని వాడితే మలేరియా, చర్మవ్యాధులపాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఏరోజు నీరు ఆరోజు వాడుకోవడం మంచిది’ అని పేర్కొన్నారు.