News April 1, 2025
టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?

APలో టెన్త్ పరీక్షలు ముగిశాయి. మార్చి 17న తెలుగు పరీక్షతో ప్రారంభమైన పరీక్షలు ఇవాళ సోషల్ స్టడీస్తో ముగిశాయి. 6.24 లక్షల మంది విద్యార్థులకు గాను 6.17 లక్షల మంది హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమై ఈ నెల 9వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత పలు దఫాల పరిశీలన అనంతరం మే రెండో వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది.
Similar News
News January 20, 2026
ఆముదం పంటలో దాసరి పురుగు నివారణ ఎలా?

దాసరి పురుగు ఆముదం పంటను జనవరి మాసం వరకు ఆశిస్తుంది. ఈ పురుగు పంటపై ఆశించిన తొలిదశలో ఆకులను గోకి తర్వాత రంధ్రాలు చేసి ఆకులన్నీ తింటాయి. పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొమ్మలను, కాడలను, పెరిగే కాయలను తిని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. దాసరి పురుగుల నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ కలిపి పంటపై పిచికారీ చేయాలి.
News January 20, 2026
వ్యాసుడు చెప్పిన కొన్ని పవిత్ర ధర్మాలు

మూగ జీవులను హింసించకూడదు.
అబద్ధాలు చెప్పకూడదు.
దొంగతనం చేయకూడదు.
ఇతరుల ఆహారం అపహరిస్తే నరకానికి వెళ్తారు.
తెలిసి పాపాలు చేసిన వారు పూజలు చేయకూడదు.
రహస్యాలు రహస్యంగానే ఉంచాలి.
వేదాలను, గురువులను, నిందించరాదు.
కపటం గలవారితో కలిసి పుణ్య కార్యాలు చేయకూడదు.
పర స్త్రీని తల్లిలా భావించి, గౌరవించాలి.
News January 20, 2026
ఆర్టీఐ ద్వారా ప్రజలు అడిగిన సమాచారం ఇవ్వాలి: చీఫ్ కమిషనర్

AP: ప్రజలు అడిగిన సమాచారాన్ని సమయానికి ఇవ్వకపోతే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆర్టీఐ చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇవాళ మంగళగిరిలోని ఆర్టీఐ ఆఫీస్లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి సంబంధించిన సమగ్ర సమాచారం సామాన్యులకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రాథమిక హక్కుని అమలు చేస్తామని తెలియజేశారు.


