News July 1, 2024

టెట్ పరీక్షలు, ఫలితాలు ఎప్పుడంటే?

image

AP: జులై 4 నుంచి 16 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జులై 25న హాల్ టికెట్లు విడుదల చేస్తామని, ఆగస్టు 5 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆగస్టు 25న టెట్ ఫైనల్ కీ, 30న ఫలితాలు రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News October 29, 2025

బాత్రూమ్‌లో ఈ తప్పులు చేయకండి!

image

బాత్రూమ్‌లో స్నానం చేసేటప్పుడు చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.
*బాత్రూంలో ఫోన్ వాడొద్దు.
*మూత తెరిచి ఫ్లష్ చేస్తే వ్యాధికారక క్రిములు వ్యాపిస్తాయి.
*ఎక్కువ సేపు కమోడ్‌పై కూర్చుంటే పైల్స్ రావచ్చు.
*రోజూ వేడి నీటి స్నానం చర్మాన్ని పొడి బారుస్తుంది.
*ఎక్కువ సబ్బు వాడటం చర్మానికి హానికరం.
*బలంగా టవల్‌తో రుద్దితే అది చర్మానికి నష్టం కలిగిస్తుంది. Share it

News October 29, 2025

ఆ రూ.20 లక్షలు మాకొద్దు: బాధితురాలు

image

కరూర్‌ తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాల సహాయార్థం TVK చీఫ్ విజయ్ రూ.20 లక్షల చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. అయితే మృతుల్లో ఒకరైన రమేశ్ భార్య సంఘవి ఆ డబ్బును తిప్పి పంపడం చర్చనీయాంశమైంది. ‘మాకీ డబ్బు ముఖ్యం కాదు. నేరుగా వచ్చి పరామర్శిస్తానని, ముందు డబ్బు తీసుకోమని చెప్పారు. ఆయన పరామర్శ కోసం ఎదురుచూశాం. చెన్నై సమావేశానికి వెళ్లేందుకు మేము నిరాకరిస్తే మా బంధువులను తీసుకెళ్లారు’ అని తెలిపారు.

News October 29, 2025

ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

image

పీరియడ్స్‌లో అమ్మాయిలు చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకు ఓ సారి ప్యాడ్స్ మార్చాలి. మైల్డ్, సువాసన లేని సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.