News January 25, 2025
టెట్ ఫలితాలు ఎప్పుడంటే?
TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫలితాలను ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. నిన్న టెట్ ప్రిలిమినరీ ‘కీ’తో పాటు రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసింది. ఇవాళ్టి నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొంది. కాగా ఈనెల 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఫలితాల విడుదల తర్వాత ఏప్రిల్లో సుమారు 5వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
Similar News
News January 26, 2025
పద్మ అవార్డు గ్రహీతలకు YS జగన్ విషెస్
పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి (వైద్యం), నందమూరి బాలకృష్ణ (కళలు), మంద కృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు), మాడుగుల నాగఫణి శర్మ (కళలు), కేఎల్ కృష్ణ (విద్య, సాహిత్యం), మిరియాల అప్పారావు (మరణానంతరం) (కళలు), వాదిరాజు రాఘవేంద్రాచారి పంచముఖి (విద్య, సాహిత్యం)’ అని వారి పేర్లను ట్వీట్ చేశారు.
News January 26, 2025
రోహిత్ రిటైరవ్వకండి.. 15 ఏళ్ల అభిమాని లేఖ
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ అభిమాని లేఖ రాశారు. ‘నేను క్రికెట్ చూసేందుకు మీరే కారణం. ఈ మధ్య కాలంలో మీరు విఫలమవుతున్నా ఛాంపియన్స్ ట్రోఫీలో తిరిగి ఫామ్లోకి వస్తారని ఆశిస్తున్నా. రంజీలో మీరు కొట్టిన సిక్సర్లు అద్భుతం. మీరు ఎప్పుడూ రిటైరవ్వకండి. మైదానంలో ప్రతి ఫార్మాట్లో కెప్టెన్గా, ప్లేయర్గా అదరగొడుతారు’ అని ఇన్స్టా ఐడీతో ఫ్యాన్ రాసుకొచ్చారు. ఈ లేఖను రోహిత్ టీమ్ షేర్ చేసింది.
News January 26, 2025
అదరగొట్టిన భారత బౌలర్లు
ఐసీసీ U19 ఉమెన్స్ వరల్డ్ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచులో భారత బౌలర్లు అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 64/8కే పరిమితమైంది. ఆ జట్టు ప్లేయర్లలో సుమియా (21) టాప్ స్కోరర్గా నిలిచారు. భారత బౌలర్లలో వైష్ణవి 3 వికెట్లు పడగొట్టగా, షబ్నమ్, జోషిత, త్రిష తలో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 20 ఓవర్లలో 65 పరుగులు చేయాలి.