News June 13, 2024
పథకాల గురించి అడిగితే ‘ఓ స్త్రీ రేపు రా’ కథ చెబుతున్నారు: నిరంజన్

TG: కాంగ్రెస్ నేతలకు ఎన్నికల ప్రచారంపై ఉన్న శ్రద్ధ పథకాల అమలుపై ఉండదా? అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘సీఎం, మంత్రులను పథకాల గురించి అడిగితే దయ్యానికి భయపడి గోడలమీద రాసే ‘ఓ స్త్రీ రేపు రా’ కథను వినిపిస్తున్నారు. డిసెంబరు 9 నుంచి రూ.15 వేల రైతు భరోసా అనే హామీ ఏమైంది? వరికి రూ.500 బోనస్ వట్టి బోగస్ అని తేలిపోయింది. INC హామీలు నీటి మీది రాతలని ప్రజలకు తెలిసింది’’ అని పేర్కొన్నారు.
Similar News
News October 23, 2025
లేటెస్ట్ మూవీ అప్డేట్స్!

* రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజాసాబ్’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
* ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డూడ్’ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ఈనెల 17న ఈ చిత్రం రిలీజవగా వారం రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం.
News October 23, 2025
కరప్షన్, క్రైమ్.. ఇవే NDA డబుల్ ఇంజిన్లు: తేజస్వీ

ఎన్డీయే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కలిసి పని చేస్తామని ఆర్జేడీ నేత, మహాఘట్బంధన్ <<18080695>>సీఎం అభ్యర్థి<<>> తేజస్వీ యాదవ్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారులో ఒక ఇంజిన్ కరప్షన్, మరోది క్రైమ్ అని ఎద్దేవా చేశారు. బిహార్‌లో నేరాలు పెరిగిపోతున్నాయని, 200 రౌండ్ల కాల్పులు జరగని రోజంటూ లేదని అన్నారు. కొత్త బిహార్ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. NDA సీఎం అభ్యర్థి ఎవరో BJP, అమిత్ షా క్లారిటీ ఇవ్వాలన్నారు.
News October 23, 2025
టాస్ గెలిచిన న్యూజిలాండ్

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా, న్యూజిలాండ్ జట్లు నవీ ముంబై వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన NZW జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
INDW ప్లేయింగ్ Xl: ప్రతీకా, స్మృతి మంధాన, హర్లీన్, హర్మన్‌ప్రీత్(C), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి, రిచా, స్నేహ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్
NZW: సుజీ బేట్స్, జార్జియా, అమేలియా, సోఫీ(C), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా, జెస్ కెర్, రోజ్మేరీ, లియా, ఈడెన్ కార్సన్