News May 24, 2024
బ్రదర్స్ డే.. ఎప్పుడు మొదలైందంటే?

మే 24.. అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. 2005 నుంచి బ్రదర్స్ డే నిర్వహిస్తున్నారు. అమెరికాలోని అలబామా రాష్ట్రానికి చెందిన రచయిత సి డేనియర్ రోడ్స్ మొదటిసారి సోదరుల దినోత్సవాన్ని జరుపుకున్నారట. అప్పటి నుంచి క్రమంగా అన్ని దేశాల్లో మొదలైంది. రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములనే కాకుండా.. మనతో ఆత్మీయంగా ఉండే స్నేహితులను కూడా సోదరులుగా భావిస్తూ ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు.
#Happy Brother’s Day
Similar News
News December 8, 2025
మీ ఫ్రిజ్ ఎక్కువకాలం పనిచేయాలంటే?

* ఫ్రిజ్ కంపార్ట్మెంట్ టెంపరేచర్‌ను 4°C, ఫ్రీజర్‌ను -18°C వద్ద మెయింటేన్ చేయండి.
* వేడి కంటైనర్లను నేరుగా లోపల పెట్టవద్దు.
* సరిగ్గా డోర్ వేయండి. పదేపదే డోర్ తెరవొద్దు.
* ఫ్రిజ్ కాయిల్స్, లోపలి భాగాలను తరచూ క్లీన్ చేయండి.
* ఫ్రిజ్‌ను పూర్తిగా నింపేయకుండా ఖాళీ స్థలాన్ని ఉంచండి.
* ఫ్రిజ్ చుట్టూ కనీసం 10CM స్థలాన్ని వదలండి.
* ఒవెన్స్, డిష్ వాషర్స్, డైరెక్ట్ సన్‌లైట్‌కు దూరంగా ఫ్రిజ్‌ను ఉంచండి.
News December 8, 2025
ఇంటర్వ్యూతో BELలో పోస్టులు

HYD-నాచారంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News December 8, 2025
T20WC.. ‘స్ట్రీమింగ్’ నుంచి తప్పుకున్న జియోహాట్‌స్టార్!

వచ్చే ఏడాది T20WC స్ట్రీమింగ్ బాధ్యతల నుంచి జియో హాట్‌స్టార్ తప్పుకున్నట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. రెండేళ్ల అగ్రిమెంట్ ఉన్నప్పటికీ తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొనసాగలేమని ICCకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. దీంతో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ పిక్చర్స్ రేసులోకి వచ్చినట్లు తెలిపింది. ఇదే నిజమైతే టోర్నీ వీక్షించడానికి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ప్రేక్షకుల జేబుకు చిల్లు పడటం ఖాయం.


