News September 7, 2024
గణేశ్ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?

రాష్ట్రకూట, శాతవాహన, చాళుక్యుల కాలం నుంచి గణేశ్ చతుర్థిని జరుపుకుంటున్నారు. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ గణేశ్ చతుర్థిని జరిపించారు. తర్వాత పీష్వా రాజవంశం దీనిని కొనసాగించింది. 1893లో పుణేలో తొలిసారి బహిరంగంగా గణేశ్ ఉత్సవాలు మొదలెట్టారు. జాతీయోద్యమంలో హిందువులందరినీ ఏకతాటిపైకి తేవడానికి బాలగంగాధర్ తిలక్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఆ తర్వాత నుంచి దేశమంతటా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు.
Similar News
News October 19, 2025
దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి?

దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి, తన తేజస్సుతో అజ్ఞానమనే చీకటిని తరిమివేసి, భక్తులను అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పండుగ రోజున దీపాలు పెట్టి అమ్మవారిని ఆహ్వానించాలనే ఆచారాన్ని మనం అనాదిగా పాటిస్తున్నాం. నేడు ఇలా దీపాలు వెలిగిస్తే అమ్మవారు మనపై అనుగ్రహం చూపి సంపదలు స్థిరంగా ఉండేలా చేస్తారని నమ్మకం. ఆర్థిక స్థితి మెరుగై, కుటుంబంలోని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
News October 19, 2025
పారిశ్రామికవేత్తలకు CM చంద్రబాబు శుభవార్త

AP: పారిశ్రామికవేత్తలకు CM చంద్రబాబు దీపావళి సందర్భంగా శుభవార్త చెప్పారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసి ఆయా సంస్థలకు చేయూత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా రూ.1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను తొలి విడతగా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
News October 19, 2025
భారీ జీతంతో NMDCలో ఉద్యోగాలు

NMDC లిమిటెడ్ 14 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, CGM, GM, డైరెక్టర్ తదితర పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులకు OCT 21 ఆఖరు తేదీ కాగా.. డైరెక్టర్ పోస్టుకు OCT 27 లాస్ట్ డేట్. పోస్టును బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ (మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్), PG, PG డిప్లొమా, MBA, MSc, ఎంటెక్, MSc జియోలజీ, CA/ICMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.