News July 26, 2024

ఒలింపిక్స్‌లోకి భారత్ ఎంట్రీ ఎప్పుడు ఇచ్చిందంటే..!

image

ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న పారిస్‌లోనే 124 ఏళ్ల క్రితం 1900లో తొలిసారిగా భారత్ పేరు వినపడింది. ఈ పోటీల్లో కోల్‌కతాలో జన్మించిన నార్మన్ ప్రిచార్డ్ అనే బ్రిటిష్ ఇండియన్ పాల్గొని 200m స్ప్రింట్‌లో వెండి పతకం సాధించారు. అయితే అతను ఇండియాకు ఆడలేదని కొందరు వాదించినా భారత్‌కే ప్రాతినిధ్యం వహించారని ఒలింపిక్ కమిటీ తేల్చి చెప్పింది. ఆ తర్వాత 1920 ఒలింపిక్స్‌లో ఐదుగురు భారతీయులు పాల్గొన్నారు. <<-se>>#Olympics2024<<>>

Similar News

News November 13, 2025

‘ఉగ్ర’వర్సిటీ.. పేలుళ్లకు పథక రచన అక్కడే!

image

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో ఫరీదాబాద్‌ అల్ ఫలాహ్ వర్సిటీ వార్తల్లో నిలిచింది. దేశంలో కల్లోలం సృష్టించేందుకు ఇక్కడి నుంచే డా.ఉమర్ నబీ, ముజమ్మిల్ పథకం రచించారు. వీరు డాక్టర్లు షాహీన్, ఆదిల్‌తో సంప్రదింపులు జరిపారు. 4 నగరాల్లో పేలుళ్లు జరపాలనుకున్నారు. కానీ ఫండ్ రైజ్ డబ్బుల విషయంలో ఉమర్, ముజమ్మిల్‌ మధ్య విభేదాలు రావడంతో ప్లాన్ ప్రకారం వారు అనుకున్నట్లు జరగలేదు. లేదంటే మరింత మంది బలయ్యేవారేమో!

News November 13, 2025

తెలంగాణలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం

image

దేశీయ మంచి నీటి చేపలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం తెలంగాణలోని రంగారెడ్డి(D) కోహెడలో 13ఎకరాలను ఎంపిక చేసింది. దీని ఏర్పాటుకు రూ.47 కోట్లను మంజూరు చేసింది. దేశంలోని జలాశయాలు, డ్యాములు, చెరువులు, కుంటల్లో చేపలను దేశవిదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.

News November 13, 2025

తెలుగు రాష్ట్రాల మత్స్యకారులకు ప్రయోజనం

image

మంచినీటిలో చేపల ఉత్పత్తికి సంబంధించిన ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన అమలులో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ 2024లో మంచినీటి చేపల ఉత్పత్తి 4.39 లక్షల టన్నులు, మంచినీటి రొయ్యల ఉత్పత్తి 16,532 టన్నులుగా ఉంది. అందుకే ఈ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణను కేంద్రం ఎంపిక చేసింది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల మత్స్యకారులు, వ్యాపారులకు లబ్ధి కలగడంతో పాటు 5వేల మందికి ఉపాధి లభిస్తుంది.