News August 12, 2024
అన్న క్యాంటీన్ల ప్రారంభం ఎప్పుడంటే?

AP: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న ఉదయం 6:30 గంటలకు కృష్ణా(D) ఉయ్యూరులో చంద్రబాబు క్యాంటీన్ను ప్రారంభిస్తారని మంత్రి నారాయణ తెలిపారు. మరుసటి రోజు 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారని వెల్లడించారు. తొలి విడతలో 100 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. వీటికి ఆహార సరఫరా కాంట్రాక్టును హరేకృష్ణ ఫౌండేషన్కు అప్పగించారు.
Similar News
News December 25, 2025
తగ్గేదేలే.. లీడర్స్ ON FIRE

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల నాయకులు ఫైర్ మీదున్నారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడంలో ఎవరూ తగ్గడం లేదు. AP సీఎం చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ YCP నేతలకు <<18625628>>వార్నింగ్స్<<>> ఇస్తుండగా, జగన్ సైతం బయటకు వచ్చినప్పుడల్లా ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఫైరవుతున్నారు. ఇటు తెలంగాణలోనూ సీఎం రేవంత్, BRS చీఫ్ కేసీఆర్, KTR, హరీశ్ రావు <<18660564>>విమర్శలతో<<>> రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.
News December 25, 2025
గజ గజ.. బయటికి వెళ్తే స్వెటర్లు మరవద్దు!

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో చిన్నారులు, వృద్ధులను బయటికి తీసుకెళ్లొద్దని సూచిస్తున్నారు. తప్పనిసరి అయితే స్వెటర్లు ధరింపజేయాలని చెబుతున్నారు. చెవులు, అరచేతులు, పాదాలు వెచ్చగా ఉండేలా చూడాలంటున్నారు.
News December 24, 2025
గ్రామ స్వరాజ్ అభియాన్ శిక్షణలో AP టాప్

AP: రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ శిక్షణలో జాతీయ స్థాయిలో రాష్ట్రం నంబర్.1 స్థానాన్ని సాధించింది. 2.82 లక్షల మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులకు శిక్షణ అందించి ఈ ఘనత సొంతం చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ విభాగంలో రాష్ట్రం 24వ స్థానంలో ఉండగా ఇప్పుడు అగ్రస్థానానికి చేరిందని కూటమి ప్రభుత్వం తెలిపింది. స్థానిక సంస్థలను ప్రగతి పథంలో నడిపిస్తున్నట్లు పేర్కొంది.


