News August 15, 2025
దసరా సెలవులు ఎప్పటి నుంచంటే?

తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్‌లో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏపీ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇచ్చారు. క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్ ఉండనున్నాయి. అటు తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు ఇచ్చారు. అలాగే TGలో సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉంది.
Similar News
News August 15, 2025
GST.. ఏ వస్తువులు ఏ శ్లాబ్‌లోకి..!

<<17416480>>GST<<>>లో రెండే శ్లాబులు ఉంటాయని కేంద్రం ప్రతిపాదించింది. CNBC TV18 ప్రకారం ఏ వస్తువులు ఏ శ్లాబులోకి వస్తాయంటే..
*TVలు, ACలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు 28% నుంచి 18%
*ఆహారం, మెడిసిన్స్, విద్య, నిత్యావసర వస్తువులు 0 లేదా 5%
*వ్యవసాయ పనిముట్లు 12% నుంచి 5%
*ఇన్సూరెన్స్ 18% నుంచి 5% లేదా జీరో
>>SEP/OCTలో GST కౌన్సిల్ దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
News August 15, 2025
సూపర్ సిక్స్ హామీలు.. సూపర్ హిట్టేనా?

AP: ‘సూపర్ సిక్స్ హామీలు’ సూపర్ హిట్ అయ్యాయని CM చంద్రబాబు అన్నారు. <<17416088>>ఫ్రీ బస్సు<<>>, పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ తదితర హామీలు నెరవేర్చామని చెప్పారు. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1,500 హామీలు అమలు కావాల్సి ఉంది. మంచి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం గురించి లబ్ధిదారులే ప్రచారం చేయాలని CM కోరారు. ఆయన చెప్పినట్లు ‘సూపర్ 6’ సూపర్ హిట్ అయ్యాయా? మీ COMMENT.
News August 15, 2025
APP ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TG: స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 118 పోస్టులను భర్తీ చేయనుంది. వేతనాలు, అర్హతలు, ఎంపిక విధానానికి సంబంధించిన వివరాలు అధికారిక <