News October 27, 2024

దీపావళి లక్ష్మీపూజకు సమయమిదే?

image

శ్రీరాముడు వనవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చింది, అలాగే నరకాసురుడిని సత్యభామ చంపింది ఒకే రోజు. ఈ రోజునే దీపావళిగా జరుపుకుంటారని ప్రతీతి. అప్పటినుంచి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగించడం ఆనవాయితీ. ఈసారి అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా సాయంత్రం 6.10 గంటల నుంచి రాత్రి 8.52 గంటల మధ్య లక్ష్మీపూజ సమయమని పండితులు చెబుతున్నారు.

Similar News

News October 27, 2024

జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ.. UPDATE

image

TG: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. పాకాల రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారనే సమాచారంతో రైడ్ చేశామని FIRలో తెలిపారు. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు తేలిందని, మిగతా వారు టెస్టులకు సహకరించలేదని చెప్పారు. రాజ్ సూచించడంతోనే తాను డ్రగ్స్ తీసుకున్నట్లు విజయ్ చెబుతున్నారని పేర్కొన్నారు.

News October 27, 2024

ప్రజల ఆశలు, ఆకాంక్షలను వమ్ము చేస్తోన్న కాంగ్రెస్: కిషన్ రెడ్డి

image

TG: కాంగ్రెస్‌ను నమ్మి అన్ని వర్గాలు మోసపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను వమ్ము చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ఆరు గ్యారంటీలు, 400 హామీలను ఎలా అమలు చేస్తుంది? పెన్షన్లు, దళితబంధు, నిరుద్యోగ భృతి గురించి సర్కార్ ఆలోచించడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. మూసీ బాధితుల కోసం కరసేవ చేసేందుకు మేం సిద్ధం’ అని ఆయన ప్రకటించారు.

News October 27, 2024

దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే!

image

ఇండియాలో 2024కి గాను అత్యుత్తమ బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ SBIని బెస్ట్ బ్యాంకుగా ఎంపిక చేసింది. వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి ఈ అవార్డును అందుకున్నారు. అత్యుత్తమ సేవలు, ఖాతాదారుల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో ఎస్బీఐ ముందంజలో ఉందని ఆ మ్యాగజైన్ తెలిపింది. మన దేశంలో SBIకి 22500 బ్రాంచులు, 62వేల ఏటీఎంలు ఉన్నాయి.