News May 1, 2024

‘డిపాజిట్ గల్లంతు’ అని ఎప్పుడు అంటారంటే..

image

ఎన్నికల ఫలితాల సమయంలో డిపాజిట్లు గల్లంతయ్యాయట అని అనడం వింటుంటాం. ఏంటీ ‘డిపాజిట్ గల్లంతు’..? ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ సమయంలో నిర్దేశిత రుసుమును రిటర్నింగ్ అధికారి వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ మొత్తం తిరిగి పొందాలంటే మొత్తం ఓట్లలో ఆరోవంతు, అంటే కనీసం 16శాతం ఓట్లు వారికి రావాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వస్తే డిపాజిట్ వెనక్కివ్వరు. దీన్నే ‘డిపాజిట్ గల్లంతు’గా వ్యవహరిస్తారు.

Similar News

News March 12, 2026

The Hundred: పాక్ ప్లేయర్‌ను సన్‌రైజర్స్ కొనడంపై విమర్శలు!

image

ఇంగ్లండ్‌ టోర్నీ The Hundred వేలంలో పాక్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను సన్ రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ₹2.34 కోట్లకు అతడిని దక్కించుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి ఇది సిగ్గు చేటని ఫైరవుతున్నారు. ఇండియాను, ఆర్మీని ఎగతాళి చేసే వ్యక్తిని తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. IPL అనుబంధ ఫ్రాంచైజీలు పాక్ ప్లేయర్లను అవైడ్ చేస్తాయని ఇటీవల వార్తలొచ్చాయి.

News March 12, 2026

రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు

image

TG: మండుతున్న ఎండలు, ఉక్కపోతకు ఉపశమనం కలిగించేలా రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, హైదరాబాద్, మేడ్చల్, MBNR జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయని పేర్కొంది. అప్పటివరకు ఎండలు దంచి కొట్టనున్నాయని వెల్లడించింది.

News March 12, 2026

ఆయిల్ ధరలు పెరిగితే అమెరికాకే లాభం.. కానీ: ట్రంప్

image

క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే అమెరికాకే బెనిఫిట్ అని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అని.. ధరలు పెరిగితే USకు భారీగా ఆదాయం వస్తుందన్నారు. కానీ అది తన ప్రాధాన్యం కాదన్నారు. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా, పశ్చిమాసియాతో పాటు ప్రపంచాన్ని నాశనం చేయకుండా ఇరాన్‌ను అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.