News October 15, 2024

OTTలోకి ‘తంగలాన్’ వచ్చేది ఎప్పుడంటే?

image

విక్రమ్ నటించిన ‘తంగలాన్’ సినిమా దీపావళి కానుకగా ఓటీటీ(Netflix)లోకి రానుంది. ఈ విషయాన్ని నిర్మాత జ్ఞానవేల్ రాజా తాజాగా X స్పేస్‌లో వెల్లడించారు. ఓటీటీ రిలీజ్‌కు ఎలాంటి సమస్యలు లేవని, పండుగ సందర్భంగా స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో రూ.100కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

Similar News

News January 16, 2026

డ్రిప్ సిస్టమ్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

సాగులో నీటి వృథా కట్టడికి వాడే డ్రిప్ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో ట్రాక్టర్‌లు, బండ్లు, పశువుల రాకపోకల వలన లేటరల్ పైపులు అణిగిపోకుండా చూడాలి. ఎలుకలు డ్రిప్ సిస్టమ్‌లోని లేటరల్ పైపులను, ఇతర భాగాలను కొరికేయకుండా ఉండాలంటే సిస్టమ్‌ను తరచూ వాడాలి. దీని వల్ల భూమి తేమగా ఉండి ఎలుకలు ఆ పైపుల దగ్గరకురావు. కలుపు తీసేటప్పుడు పదునైన పరికరాలు డ్రిప్ లేటరల్ పైపులను కోసేయకుండా జాగ్రత్తపడాలి.

News January 16, 2026

మేమిచ్చే సన్నబియ్యం పిల్లలకూ పెడుతున్నారు: రేవంత్

image

TG: గత ప్రభుత్వంలో ఎప్పుడైనా రేషన్ బియ్యం తిన్నారా అని సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ సభలో ప్రశ్నించారు. ‘మేము రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం ఇస్తున్నాం. గతంలో రేషన్ బియ్యం ఎవరూ తినేవారు కాదు. ఇప్పుడు పిల్లలకు కూడా పెడుతున్నారు. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. రైతులతో పాటు 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News January 16, 2026

ప్రజల కోసమే మోదీని కలుస్తున్నా: CM

image

TG: తాను అభివృద్ధి కోసం, నిధుల కోసం ఎవరినైనా కలుస్తానని CM రేవంత్ స్పష్టం చేశారు. ‘నేను పదేపదే ప్రధానిని కలుస్తానని చాలా మంది అంటుంటారు. మోదీ నాకు బంధువు కాదు. ఆయన దేశానికి ప్రధాని. ఎన్నికల వరకే రాజకీయం. ప్రధాని అనుమతిస్తేనే నిధులు వస్తాయి. నాకు పర్సనల్ అజెండా లేదు. గత ప్రభుత్వం పదేళ్లు కేంద్రాన్ని అడగలేదు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. అందుకే మోదీని కలుస్తున్నా’ అని నిర్మల్ సభలో తెలిపారు.