News August 27, 2024
‘యాపిల్ ఈవెంట్’ ఎప్పుడంటే?

ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఈవెంట్ను సెప్టెంబర్ 9న నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. కంపెనీ ఉత్పత్తులు, వాటి ఫీచర్లను వెల్లడించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్లో ఐఫోన్ 16 సిరీస్, యాపిల్ వాచ్ వంటి ఉత్పత్తులపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్స్లో ఈ కార్యక్రమం జరగనుంది.
Similar News
News November 23, 2025
ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారు కానీ ఆధారాలు లేవు: ప్రశాంత్ కిషోర్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంపై జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే అనుమానం ఉందని, కానీ దానికి ఆధారాలు లేవని తెలిపారు. గ్రౌండ్ ఫీడ్బ్యాక్కు భిన్నంగా ఫలితాలు ఉన్నాయని, ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోందని అన్నారు. కాగా 243 స్థానాలున్న బిహార్లో 238 చోట్ల పోటీ చేసినా JSP ఒక్క సీటు కూడా గెలవలేదు. ఓటు శాతం 2-3%కే పరిమితమైంది.
News November 23, 2025
చెమటోడ్చుతున్న భారత బౌలర్లు

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు చెమటోడ్చుతున్నారు. రెండో రోజూ ఆట తొలి సెషన్లో వికెట్లేమీ తీయలేదు. అర్ధసెంచరీ చేసిన ముత్తుస్వామి(56*), కైల్(38*) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఏడో వికెట్కు 70 పరుగులు జోడించారు. టీ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు తొలి ఇన్నింగ్సులో 316/6.
News November 23, 2025
రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు: ఐబొమ్మ రవి తండ్రి

<<18323509>>ఎన్కౌంటర్<<>> చేయాలన్న నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలను ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు తప్పు బట్టారు. ‘ఆయనను ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారు. నేను 45 పైసలతో సినిమా చూశా. ఇప్పుడు రేట్లు పెరిగాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు. నా కొడుకు తరఫున వాదించే న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేస్తా’ అని చెప్పారు.


