News August 28, 2024
డీఎస్సీ ఫైనల్ కీ ఎప్పుడంటే?

TG: డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీని వచ్చే నెల 2న రిలీజ్ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. అనంతరం జిల్లాల వారీగా ర్యాంకుల జాబితాను వెల్లడించనుంది. రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలవనుంది. ఆ తర్వాత మెరిట్ ఉన్న వారికి జాయినింగ్ ఆర్డర్స్‌ను అధికారులు ఇవ్వనున్నారు. మొత్తం 11,062 పోస్టులకు జులై 18 నుంచి ఆగస్టు 5వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
Similar News
News December 21, 2025
జగిత్యాల జిల్లా స్థాయి వంటల పోటీల్లో విజేతలు వీరే

జగిత్యాలలోని అన్ని మండలాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల(పురాతన)లో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న వంట వారికి, వారి సహాయకులకు జిల్లా స్థాయి వంటల పోటీలను విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. మొదటి బహుమతి జగిత్యాల అర్బన్, రెండవ బహుమతి బీర్పూర్, మూడో బహుమతి గొల్లపల్లి మండలాలకు లభించింది. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సమగ్ర శిక్ష ఏఏంఓ రాజేష్, డీఎస్ఓ మచ్చ రాజశేఖర్ వ్యవహరించారు.
News December 21, 2025
RSSకు పొలిటికల్ అజెండా లేదు: మోహన్ భాగవత్

హిందూ సమాజ అభివృద్ధి, రక్షణ కోసం RSS పనిచేస్తుందని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు. సంఘ్‌కు ఏ పొలిటికల్ అజెండా లేదని, సమాజాన్ని చైతన్యపరిచి భారత్‌ను మరోసారి ‘విశ్వగురు’ చేయాలనేదే టార్గెట్ అన్నారు. RSS గురించి మాట్లాడే హక్కు అందరికీ ఉంటుందని, అయితే అవి వాస్తవికత ఆధారంగా ఉండాలన్నారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కోల్‌కతాలోని సైన్స్ సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
News December 21, 2025
డ్రాగన్ ముప్పుకు ‘ద్వీప’ కవచం: అమెరికా మాస్టర్ ప్లాన్!

A2/AD వ్యూహంతో అమెరికా నౌకలకు చైనా సవాల్ విసురుతున్న వేళ పెంటగాన్ తన పాత EABO వ్యూహానికి పదును పెడుతోంది. భారీ నౌకలపై ఆధారపడకుండా పసిఫిక్ ద్వీపాల్లోని WW-II నాటి ఎయిర్‌ఫీల్డ్స్‌ను పునరుద్ధరిస్తోంది. తద్వారా విస్తారమైన ప్రాంతంలో క్షిపణులను మోహరిస్తూ, తైవాన్ రక్షణే లక్ష్యంగా చైనా చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సిద్ధం చేస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఇది కీలకంగా మారనుంది.


