News September 7, 2024
OTTలోకి ‘ది గోట్’ వచ్చేది ఎప్పుడంటే?

తమిళ హీరో విజయ్ నటించిన ‘ది గోట్’ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రూల్స్ ప్రకారం థియేటర్లో రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీలో రావాల్సి ఉంటుంది. అంటే దీపావళికి లేదా నవంబర్ తొలి వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ డ్యుయల్ రోల్లో కనిపించారు. ఈనెల 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.
Similar News
News November 21, 2025
బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.