News March 24, 2024
ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

AP: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో కేవలం 75 మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాగా.. ఇంత తక్కువ కేసులు నమోదు కావడం బోర్డు చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పటికే వాల్యుయేషన్ ప్రారంభించిన అధికారులు ఏప్రిల్ 4 నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఏప్రిల్ 2వ వారంలో ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్నారు.
Similar News
News October 28, 2025
విదేశాల్లో జాబ్ చేయాలనుకుంటున్నారా?

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జర్మనీలో మెకానిక్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ/డిప్లొమా/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 10వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. వెబ్సైట్: https://naipunyam.ap.gov.in/
News October 28, 2025
పొట్టి కప్ అయినా పట్టేస్తారా?

ఆసీస్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ రేపటి నుంచి 5 మ్యాచుల T20 సమరానికి సిద్ధమైంది. బుమ్రా జట్టులోకి రానుండటం ప్లస్ కానుంది. అతడి సారథ్యంలో పేస్ దళం AUSను ఎలా కట్టడి చేస్తుందో చూడాలి. అటు యంగ్ ఇండియా బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తిగా మారింది.
స్క్వాడ్: సూర్య, అభిషేక్, గిల్, తిలక్, నితీశ్, దూబే, అక్షర్, జితేశ్, వరుణ్, బుమ్రా, అర్ష్దీప్, కుల్దీప్, హర్షిత్, సంజూ, రింకూ, సుందర్
News October 28, 2025
మూడోసారీ అధ్యక్షుడు కావాలనుంది: ట్రంప్

రెండోసారి US అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మూడోసారీ పోటీ చేయాలని ఉందన్నారు. మలేషియా నుంచి టోక్యోకు వెళ్తుండగా ఎయిర్ఫోర్స్ వన్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయం బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా నిలబడతారన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేసే మార్గాలున్నాయని, ఇంకా ఆ దిశగా ఆలోచించలేదన్నారు. అయితే US చట్టం ప్రకారం మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయలేరు.


