News September 25, 2024
‘గేమ్ ఛేంజర్’ నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో ఎప్పుడంటే?

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘రా మచ్చ మచ్చ’ సాంగ్ ప్రోమోను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సాంగ్కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Similar News
News November 1, 2025
IVFలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..?

సహజంగా తల్లిదండ్రులు కాలేని దంపతులకు IVF ఒక వరం. ఇందులో 45-50% సక్సెస్ రేట్ ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయంటున్నారు నిపుణులు. సంతానోత్పత్తి మందుల కారణంగా మానసికకల్లోలం, తల, కడుపు నొప్పి, వేడిఆవిర్లు, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు అండాశయ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్(OHSS) వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మహిళల అండాశయాలు ఉబ్బి శరీరంలోకి ద్రవాన్ని లీక్ చేయవచ్చు.
News November 1, 2025
ఆధార్ అప్డేట్స్.. నేటి నుంచి మార్పులు

✦ ఆధార్లో పేరు, అడ్రస్, DOB, ఫోన్ నంబర్ను సేవా కేంద్రానికి వెళ్లకుండా ఇంటి నుంచే ఆన్లైన్(₹75 ఛార్జీ)లో మార్చుకోవచ్చు. ఫింగర్ ప్రింట్, ఐరిస్, ఫొటో అప్డేట్ కోసం మాత్రం వెళ్లాలి.
✦ UIDAI కొత్త ఫీ స్ట్రక్చర్ తీసుకొచ్చింది. డెమోగ్రాఫిక్ వివరాల మార్పునకు ₹75, బయోమెట్రిక్స్కు ₹125 చెల్లించాలి. 2026, JUN 14 వరకు ఆన్లైన్ డాక్యుమెంట్ అప్డేషన్ ఫ్రీ
✦ 2025, DEC 31లోపు ఆధార్-పాన్ లింక్ తప్పనిసరి
News November 1, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

✦ జూబ్లీహిల్స్ బైపోల్: ఇవాళ రాత్రి బోరబండ, ఎర్రగడ్డలో CM రేవంత్ ప్రచారం
✦ నేడు సా.6 గంటలకు రహమత్ నగర్లో KTR రోడ్ షో
✦ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కొత్తగా 75 PG సీట్లు మంజూరు చేసిన NMC.. 1390కి చేరిన సీట్ల సంఖ్య
✦ భవిత కేంద్రాల్లో పని చేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకూ TET మినహాయింపు కుదరదు: హైకోర్టు
✦ గద్వాల(D) ధర్మవరం BC హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. 86 మంది విద్యార్థులకు అస్వస్థత


