News August 20, 2025
అట్లీ-అల్లు అర్జున్ మూవీ షూటింగ్ ఎప్పుడంటే?

డైరెక్టర్ అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా షూటింగ్ నవంబర్‌లో ప్రారంభమవుతుందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా షూట్ కోసం దీపికా పదుకొణె 100 రోజుల కాల్షీట్లు కేటాయించినట్లు పేర్కొన్నాయి. ఇందులో బన్ని ట్రిపుల్ రోల్‌లో నటిస్తారని, దీపిక వారియర్‌గా స్పెషల్ లుక్‌లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2027లో విడుదలయ్యే అవకాశముంది.
Similar News
News August 20, 2025
పాఠ్య పుస్తకాల్లో ‘ఆపరేషన్ సిందూర్’

NCERT కీలక నిర్ణయం తీసుకుంది. 3-12వ తరగతి విద్యార్థుల పుస్తకాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ అంశాన్ని చేర్చింది. ఇందుకు సంబంధించి తాజాగా స్పెషల్ మాడ్యూళ్లు రిలీజ్ చేసింది. 3-8వ తరగతి వరకు ‘ఆపరేషన్ సిందూర్-ఏ సాగా ఆఫ్ వాల్యూర్(ఒక శౌర్య గాథ)’, 9-12వ తరగతి వరకు ‘ఆపరేషన్ సిందూర్-ఏ మిషన్ ఆఫ్ హానర్ అండ్ బ్రేవరీ(ఒక గౌరవం&ధైర్యసాహసాలు)’ టైటిళ్లతో పాఠ్యాంశాలను తీసుకువచ్చింది. పహల్గామ్ అటాక్ ఇందులో పొందుపర్చింది.
News August 20, 2025
ఆగస్టు 20: చరిత్రలో ఈ రోజు

1828: బ్రహ్మసమాజాన్ని స్థాపించిన రాజా రామమోహనరాయ్
1931: తెలుగు దివంగత హాస్యనటుడు పద్మనాభం జననం
1944: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ(ఫొటోలో)జననం
1946: ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి జననం
1977: వాయేజర్-2 వ్యోమనౌకను లాంఛ్ చేసిన నాసా
1995: హీరోయిన్ కావ్య ధాపర్ జననం
* మలేరియా నివారణ దినోత్సవం
* అక్షయ్ ఉర్జా దినోత్సవం
News August 20, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.