News December 14, 2024
రాజమౌళి-మహేశ్ బాబు మూవీ షూటింగ్ ఎప్పుడంటే?

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కే సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వెంచరస్ కథాంశంతో తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. రెండు పార్టులుగా ఈ మూవీ తెరకెక్కనుందని తెలిపాయి. మొదటి పార్ట్ 2027లో, రెండో పార్ట్ 2028 చివర్లో థియేటర్లలోకి రానున్నట్లు వెల్లడించాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News October 15, 2025
13 జిల్లాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు(1/2)

AP: ఖరీఫ్ సీజన్ పత్తి సేకరణకు ప్రభుత్వం 13 జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేస్తారు. ☛ విజయనగరం జిల్లాలోని రాజాం
☛ మన్యం జిల్లాలో సాలూరు, పాలకొండ(భామిని)
☛ కాకినాడ జిల్లాలో పిఠాపురం ☛ ఏలూరు జిల్లాలో చింతలపూడి (జంగారెడ్డిగూడెం)
☛ NTR జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు (గంపలగూడెం, ఏ కొండూరు), కంచికచర్ల
News October 15, 2025
13 జిల్లాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు (2/2)

☛ గుంటూరు జిల్లాలో ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తాడికొండ, గుంటూరు ☛ పల్నాడు జిల్లాలో మాచర్ల, పిడుగురాళ్ల, గురజాల (నడికుడి), క్రోసూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట ☛ బాపట్లలో పర్చూరు (పర్చూరు, మార్టూరు)
☛ ప్రకాశంలో మార్కాపురం ☛ కడపలో ప్రొద్దుటూరు
☛ అనంతపురంలో గుత్తి, తాడిపత్రి,
☛ నంద్యాలలో నంద్యాల ☛ కర్నూలులో ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు(పెంచికలపాడు), మంత్రాలయంలో పత్తిని కొనుగోలు చేస్తారు.
News October 15, 2025
రోడ్డు ప్రమాదం.. కుటుంబంలో నలుగురు మృతి

TG: కామారెడ్డి(D) భిక్కనూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు తాత, తల్లి, పిల్లలను కబళించింది. ఖమ్మం(D) ముస్తికుంటకు చెందిన వీరు స్కూటీపై వెళ్తుండగా రాంగ్రూట్లో వచ్చిన టిప్పర్ బలంగా ఢీకొట్టింది. తల్లి, ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ తాత, రెండేళ్ల పాపను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.