News March 1, 2025
‘ఛావా’ తెలుగు ట్రైలర్ ఎప్పుడంటే?

మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమాను తెలుగులోనూ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ను ఈ నెల 3న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పేర్కొంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక నటించారు. హిందీలో కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ సినిమా ఈ నెల 7న తెలుగులో రిలీజ్ కానుంది.
Similar News
News March 1, 2025
OTT & టీవీల్లోకి బ్లాక్ బస్టర్ మూవీ!

ఇంటిల్లిపాదిని నవ్వించేందుకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మీ ముందుకు వచ్చేసింది. ఈ చిత్రం జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతోంది. సినీ చరిత్రలో తొలిసారి ఈ మూవీ (జీ5)OTTతో పాటు TVల్లో ఒకేసారి రిలీజ్ అయింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా చూస్తున్నారా? COMMENT
News March 1, 2025
భూమిపై ఎక్కువ మంది మాట్లాడే భాషలివే!

ప్రపంచంలోని దాదాపు 58 దేశాల్లో 150 కోట్ల మంది ఇంగ్లిష్ మాట్లాడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 2023 లెక్కల ప్రకారం.. చైనీయులు మాట్లాడే మండరిన్ భాషను 110 కోట్ల మంది, ఇండియన్స్ ఎక్కువగా మాట్లాడే హిందీని 60.9 కోట్ల మంది వినియోగిస్తున్నారు. తర్వాతి స్థానాల్లో స్పానిష్ (55 కోట్లు), ఫ్రెంచ్ (30.98 CR), అరాబిక్ (27.40 CR), బెంగాలీ (27.2 CR), పోర్చుగీసు (26.36 కోట్లు), రష్యన్ (25.50 కోట్లు) ఉన్నాయి.
News March 1, 2025
ఢిల్లీలో ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్

కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ వాహనాలను గుర్తించేందుకు పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి పబ్లిక్ CNG బస్సుల్లో 90% బస్సులు తొలగిస్తామని, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది.