News February 2, 2025
వసంత పంచమి ఎప్పుడు? క్లారిటీ

వసంతి పంచమి ఇవాళా? రేపా? అని ప్రజల్లో ఉన్న సందిగ్ధతపై పండితులు క్లారిటీ ఇచ్చారు. ‘ఇవాళ ఉ.9.45 గంటల వరకు చవితి తిథి ఉంది. ఆ తర్వాత పంచమి మొదలవుతుంది. రేపు ఉ.6.50 నిమిషాలకు సూర్యోదయం ఉంటే, పంచమి తిథి ఉ.6.52 వరకు మాత్రమే ఉంది. కేవలం 2 నిమిషాలకు పర్వదినాన్ని నిర్ణయించలేం. అందుకే 2వ తేదీనే పండుగ చేసుకోవాలి. ఇవాళ ఉ.7:09 గంటల నుంచి మ.12:35 గంటల వరకు పూజకు మంచి సమయం’ అని చెబుతున్నారు.
Similar News
News November 16, 2025
RRB PO అడ్మిట్ కార్డులు విడుదల

IBPS RRB PO(Officer Scale-I) ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.ibps.in/లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్, పాస్వర్డ్తో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ నవంబర్ 22, 23 తేదీల్లో జరగనుంది. మెయిన్స్ అడ్మిట్ కార్డులు డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య అందుబాటులోకి వస్తాయి. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా 3,928 పోస్టులను భర్తీ చేయనున్నారు.
News November 16, 2025
లేటెస్ట్ సినిమా అప్డేట్స్

☛ రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా రిలీజ్ డేట్లో మార్పు.. ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే (NOV 27) థియేటర్లలోకి సినిమా.. ఈ నెల 18న ట్రైలర్
☛ నాగార్జున ‘శివ’ రీరిలీజ్కు 2 రోజుల్లో ₹3.95Cr గ్రాస్ కలెక్షన్స్
☛ నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకుడిగా త్వరలో సినిమా: సినీ వర్గాలు
☛ ధనుష్ డైరెక్షన్లో రజినీ హీరోగా సినిమా తెరకెక్కే అవకాశం: తమిళ సినీ వర్గాలు
News November 16, 2025
భారీ IPOలకు సూపర్ స్పందన

ఈ ఏడాది భారీ IPOలపై మదుపర్లు ఆసక్తి కనబరిచారు. ₹5,000Crకు పైగా విలువ ఉన్న IPOలకు సగటున 17.7 రెట్ల అధిక స్పందన లభించింది. 2021 తర్వాత ఇదే అత్యధికం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 84 IPOలు ₹1.29L Cr సమీకరించగా, అందులో ఆరు సంస్థలు ₹62,000Cr దక్కించుకున్నాయి. వీటిలో LG ఎలక్ట్రానిక్స్(38.17 రెట్లు), లెన్స్కార్ట్(28.35రెట్లు), గ్రో(17.6రెట్లు), హెక్జావేర్ (2.27రెట్లు), టాటా క్యాపిటల్ (1.96రెట్లు) ఉన్నాయి.


