News January 25, 2025
ఆ విషయానికి వస్తే అంతా ఒక్కటే

రాజకీయ పార్టీల మధ్య ఎన్ని సిద్ధాంత భేదాలున్నా, అన్నింటికీ సక్సెస్ మంత్ర మాత్రం ఉచితాలే. ఢిల్లీ ఎన్నికలే చూస్తే.. అవినీతిని ఊడ్చేస్తామనే ఆప్, ఫ్రీబీస్ ప్రమాదకరమన్న BJP సహా అన్నీ ఫ్రీ హామీలు ఇవ్వడంలో తగ్గడం లేదు. ప్రజల జీవితాలు మారుతాయో లేదో తెలియదు కానీ ప్రతిసారి హామీలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అంతా అదే తారకమంత్రం అని జపిస్తుంటే ప్రజల జీవితాలు వికసించేదెప్పుడు? దేశం అభివృద్ధి చెందేది ఎప్పుడు?
Similar News
News December 12, 2025
రేవంత్-మెస్సీ మ్యాచ్కు రాహుల్ గాంధీ

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు (శనివారం) హైదరాబాద్ రానున్నారు. ఉప్పల్లో స్టార్ ప్లేయర్ మెస్సీ పాల్గొనే ఫుట్బాల్ మ్యాచ్ను వీక్షించనున్నారు. ఈ మ్యాచ్ను చూసేందుకు రావాలని ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్, ప్రియాంక ఇతర నేతలను ఆహ్వానించడం తెలిసిందే. ఈ మ్యాచులో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఆటగాళ్లు మెస్సీ టీమ్తో పోటీపడనున్నారని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
News December 12, 2025
డిజిటల్ రూపంలో జనాభా లెక్కలు: అశ్వినీ వైష్ణవ్

2027 జనగణన నిర్వహణకు ₹11,718 కోట్లను కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. డేటా రక్షణను దృష్టిలో ఉంచుకుని జనాభా లెక్కల సమాచారం ఇకపై పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఉంటుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2027 జనాభా లెక్కలు మొట్టమొదటి డిజిటల్ జనాభా లెక్కలు అవుతాయన్నారు. 2దశల్లో జనాభా లెక్కలు నిర్వహిస్తారని వివరించారు. ముందు గృహాల గణన, జాబితా తయారీ, ఆపై జనగణన ఉంటుందన్నారు.
News December 12, 2025
విష్ణువు మన కోర్కెలు ఎలా తీరుస్తాడు?

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః|
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః||
పరమాత్ముడైన విష్ణుమూర్తి దీప్తిమంతుడు. ప్రకాశవంతుడు. ఆయన సహనశీలి. సృష్టిలో మొదటగా జన్మించింది ఆయనే. పాప రహితుడు, అనఘుడు, విజయాన్ని సైతం జయించేవాడు కూడా ఆయనే. ఇంతటి గొప్ప భగవంతుడైన ఆ దశావతార మూర్తికి మన కోర్కెలు తీర్చడం అసాధ్యమే కాదు. అందుకే ఆయనను ధ్యానిస్తే కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


