News October 6, 2025

శివుణ్ని ఏ సమయంలో దర్శించుకోవాలి?

image

పరమేశ్వరుని ఆలయానికి సాయంత్రం వెళ్లడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆ సమయంలో శివ లింగాన్ని దర్శించుకుంటే శుభం కలుగుతుందని అంటున్నారు. రోజు పూర్తయ్యే సమయంలో ఆ లయకారుణ్ని దర్శించుకోవడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఎలాంటి తొందరపాటు లేకుండా, ప్రశాంతంగా, నెమ్మదిగా భగవంతుణ్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని సూచిస్తున్నారు. <<-se>>#DharmaSandehalu<<>>

Similar News

News October 6, 2025

స్పోర్ట్స్ రౌండప్ @ 6 అక్టోబర్

image

⚾ భారత షట్లర్ తస్నీం మీర్‌పై గెలిచిన తెలుగమ్మాయి శ్రియాన్షి వలిశెట్టి కెరీర్‌లో తొలి BWF సూపర్ 100 టైటిల్ పొందారు
⚾ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ చరిత్రలో తొలిసారి అత్యధికంగా 22 మెడల్స్ (6G, 9S, 7B) సాధించింది
⚾ UP యోధాస్‌ను ఓడించిన తెలుగు టైటాన్స్‌కు PKL-12లో వరుసగా నాలుగో విజయం
⚾ వెస్టిండీస్‌పై గెలవడంతో WTC ర్యాంకింగ్స్‌లో భారత్ 3వ స్థానానికి (AUS-1, SL-2) చేరింది

News October 6, 2025

మీ పిల్లల్ని స్కూల్‌కు పంపకండి: BAS

image

ఇకపై పిల్లలను తమ స్కూళ్లకు పంపకండంటూ TGలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్(BAS) యాజమాన్యం పేరెంట్స్‌కు లేఖ రాసింది. రెండేళ్లుగా ప్రభుత్వం స్టూడెంట్ల ఫీజు చెల్లించకున్నా అప్పులు చేసి మరీ నెట్టుకొస్తున్నామని పేర్కొంది. ఇవాళ్టి నుంచి విద్యార్థుల్ని పాఠశాలల్లోకి అనుమతించమని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలోని 238 BASల్లో చదువుతున్న 23వేల మంది SC, 7వేల మంది ST విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.

News October 6, 2025

NLC ఇండియా లిమిటెడ్‌లో 163 పోస్టులు

image

NLC ఇండియా లిమిటెడ్‌ 163 అప్రెంటీస్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ ట్రేడ్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం ఈ నెల 23వరకు అప్లై చేసుకోవచ్చు. హార్డ్ కాపీని ఈ నెల 30 వరకు పంపించాలి. అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS/NAPS పోర్టల్‌లో ఎన్‌రోలింగ్ కావాలి. వెబ్‌సైట్: https://www.nlcindia.in/