News January 23, 2025

భార్యను నరికి తలకాయ కాల్చగా..

image

TG: నరరూప రాక్షసుడు గురుమూర్తి భార్యను చంపిన <<15230164>>ఘటనలో<<>> మరిన్ని సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. భార్యను ముక్కలు చేసిన అతడు తలకాయను కాల్చగా చుట్టుపక్కల వాళ్లకు వాసన వచ్చినట్లు తెలిసింది. అయితే సంక్రాంతి పండగ కావడంతో మేక తలకాయ కావొచ్చని అనుకున్నారట. ఇక భార్య శరీరాన్ని ముక్కలు చేయడాన్ని అతడు వీడియో తీసినట్లు సమాచారం. బాడీని మాయం చేసేందుకు గురుమూర్తి పలుమార్లు ‘దృశ్యం’ సినిమా చూసినట్లు తేలింది.

Similar News

News November 28, 2025

అమీన్ పీర్ దర్గాలో ‘రాజు వెడ్స్ రాంబాయ్’ టీమ్ సందడి

image

కడప పెద్ద దర్గాను ‘రాజు వెడ్స్ రాంబాయ్’ చిత్ర బృందం శుక్రవారం దర్శించుకుంది. హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజేశ్వి, నిర్మాత రాహుల్, డైరెక్టర్ సాయిల్, విక్రమ్, చైతన్య తదితరులు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. సినిమా హిట్ కావడం సంతోషంగా ఉందని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తామని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.

News November 28, 2025

విమాన వేంకటేశ్వరస్వామి విశిష్టత

image

తిరుమల గర్భాలయంపై ఉన్న గోపురాన్ని ఆనంద నిలయ విమానం అంటారు. ఈ గోపురంపై కొలువై ఉన్న స్వామివారి రూపమే ‘విమాన వేంకటేశ్వర స్వామి’. విమానం అంటే కొలవడానికి వీలుకాని అపారమైన శక్తి కలిగినది అని అర్థం. ఇది భక్తులకు నేరుగా వైకుంఠవాసుడిని చూసిన అనుభూతినిస్తుంది. ఈ గోపురంలో మొత్తం 60 మంది దేవతా మూర్తులు ఉంటారు. ఈ స్వామిని దర్శించడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 28, 2025

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: పవన్

image

AP: కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని Dy.CM పవన్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోందని తెలిపారు. అమరావతిలో బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కార్యాలయాలు ఒకేచోట ఉండటం వల్ల వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా సాగుతాయన్నారు. ఇవాళ్టి కార్యక్రమం భవనాలకే కాకుండా ఏపీ భవిష్యత్తుకు పడిన పునాది అని పేర్కొన్నారు.