News October 31, 2024

లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలంటే?

image

దీపావళి సందర్భంగా ఇళ్లలో, షాపుల్లో లక్ష్మీ పూజలు చేస్తుంటారు. అయితే, పూజ చేసేందుకు సరైన సమయాన్ని పురోహితులు సూచించారు. వేద పంచాంగం ప్రకారం ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం 5:36 నుంచి 8:11 వరకు, శుభ ముహూర్తం సాయంత్రం 5:31 నుంచి 9:55 గంటల వరకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5:31-9:55 గంటల మధ్య లక్ష్మీపూజ చేయడం శుభప్రదమని వెల్లడించారు.

Similar News

News February 8, 2026

మున్సి‘పోల్స్’: వలస ఓటర్లకు ఫ్లైట్ టికెట్లు.. ముంబై వెళ్లి ప్రచారం

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వినూత్న మార్గాలు ఎంచుకుంటున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగోజిగూడ, తాళ్లసింగారం, లింగారెడ్డి గూడెం, తంగడపల్లి గ్రామాలకు చెందిన సుమారు 200 మంది ఓటర్లు ఉపాధి కోసం ముంబైకి వెళ్లారు. వారిని రప్పించేందుకు విమానం, రైలు, బస్సు ఖర్చులు భరిస్తామని హామీలు ఇస్తున్నారు. కొందరు అభ్యర్థులు స్వయంగా ముంబైకి వెళ్లి ప్రచారం కూడా చేశారు.

News February 8, 2026

నింగిలో నిఘా: శత్రు ఉపగ్రహాలపై భారత్ సరికొత్త ‘స్నూపింగ్’!

image

అహ్మదాబాద్‌కు చెందిన ‘అజిస్తా’ సంస్థ కక్ష్యలో ఉన్న ఇతర ఉపగ్రహాలను ఫొటోలు తీసే (In-orbit imaging) సామర్థ్యాన్ని నిరూపించింది. ఇండియన్ టెక్నాలజీతో తయారైన AFR శాటిలైట్.. వేగంగా కదులుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని స్పష్టంగా ఫొటోల్లో బంధించింది. శత్రువుల కదలికలను పసిగట్టడానికి, అంతరిక్ష ఆస్తులను రక్షించుకోవడానికి, క్షిపణులను ట్రాక్ చేయడానికి ఈ ‘స్పేస్ స్నూపింగ్’ భారత్‌కు కీలకం కానుంది.

News February 8, 2026

CIPETలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ(CIPET)11 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 9 -మార్చి 3వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME/MTech, PhD, MBA, PG పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు మేనేజర్‌కు రూ.78,800, Sr. టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.67,700 చెల్లిస్తారు. సైట్: https://www.cipet.gov.in