News May 12, 2024
TS EAPCET ఫలితాలు ఎప్పుడంటే?

TS EAPCET ఫలితాలు ఈనెల 25న లేదా 27న విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాల విడుదల కోసం జేఎన్టీయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 7న ప్రారంభమైన EAPCET పరీక్షలు నిన్నటితో ముగిశాయి. గతేడాది మే 14న పరీక్షలు పూర్తవగా, అదే నెల 25న రిజల్ట్స్ వెల్లడించారు. దీంతో ఈసారి కూడా ఒకరోజు అటుఇటుగా ఫలితాలు విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈసారి ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు 2.40లక్షల మంది హాజరయ్యారు.
Similar News
News November 16, 2025
వచ్చే 2 రోజులు అధికంగా చలిగాలుల ప్రభావం

TG: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రెండు రోజులు చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రేపు పశ్చిమ, ఉత్తర తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6-9 డిగ్రీలకు, హైదరాబాద్‌లో 7-11 డిగ్రీలకు పడిపోయే ఛాన్స్ ఉందని తెలిపారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
News November 16, 2025
TELANGANA NEWS

✦ టోక్యో డెఫ్లింపిక్స్-2025 షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు రూ.1.20కోటి నజరానా: మంత్రి శ్రీహరి
✦ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో BJP MP ఈటల భేటీ.. కొంపల్లి ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలని, బాలానగర్-నరసాపూర్ హైవేలో, నాగార్జునసాగర్ ఎక్స్ రోడ్ వైపు ఫ్లై ఓవర్లు నిర్మించాలని విజ్ఞప్తి
✦ తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. అర్హులందరికీ ఇస్తాం: మంత్రి పొంగులేటి
News November 16, 2025
WTC: నాలుగో స్థానానికి పడిపోయిన భారత్

SAతో తొలి టెస్టులో ఓటమితో భారత్ WTC పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. టీమ్ ఇండియా ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలు, 3 ఓటములు, ఓ మ్యాచ్ డ్రాగా ముగించింది. ప్రస్తుతం IND విజయాల శాతం 54.17గా ఉంది. ఇక ఆడిన 3 మ్యాచుల్లోనూ గెలిచిన AUS అగ్రస్థానంలో ఉండగా, సఫారీలు(విజయాల శాతం 66.67) రెండో స్థానంలో ఉన్నారు. 3, 5, 6, 7వ స్థానాల్లో SL(66.7), PAK(50.00), ENG(43.33), BAN(16.7) ఉన్నాయి.


