News September 20, 2025
Future Cityకి పునాది ఎప్పుడంటే?

TG: దసరా సందర్భంగా సెప్టెంబర్ 25 లేదా 26న రంగారెడ్డి జిల్లాలోని మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) హెడ్ ఆఫీస్‌కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.5 కోట్లతో ప్రీకాస్ట్ టెక్నాలజీతో కేవలం మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నాగార్జునసాగర్, శ్రీశైలం హైవేలకు అనుసంధానంగా కొత్త రోడ్డు కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
Similar News
News September 20, 2025
ట్రంప్ నిర్ణయంతో భారతీయుల ఉద్యోగాలు పోతాయ్: కాంగ్రెస్

US H-1B వీసా ఫీజులు పెంచడంతో భారత్ చాలా నష్టపోతుందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘మోదీ ఫ్రెండ్ ట్రంప్ ₹6లక్షలుగా ఉన్న H-1B వీసా ఫీజును ₹88లక్షలకు పెంచారు. దీని వల్ల ఇండియన్స్‌కు USలో ఉద్యోగావకాశాలు తగ్గుతాయి. అక్కడి నుంచి INDకు వచ్చే మనీ తగ్గుతుంది. ఇక్కడి IT ఉద్యోగుల జాబ్స్ రిస్క్‌లో పడతాయి. మోదీ ఫెయిల్డ్ ఫారిన్ పాలసీ పరిణామాలను దేశం ఇప్పుడు అనుభవిస్తున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది’ అని పేర్కొంది.
News September 20, 2025
మనిషికి మద్యంతో సంబంధం ఇప్పటిది కాదు!

మనిషికి ఆల్కహాల్‌తో లక్షల ఏళ్ల క్రితమే సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అడవి చింపాంజీలు రోజూ ఒక బాటిల్ బీరు మోతాదులో పులిసిన పండ్లను తినేవని వారు గుర్తించారు. ఈక్రమంలో పూర్వీకుల నుంచే మనిషికి మద్యంపై ఆసక్తి ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పరిశోధన ప్రకారం, పండ్లలోని చక్కెర, ఆల్కహాల్ రెండూ ఆ చింపాంజీలకు ఆహార వనరులుగా ఉపయోగపడ్డాయి.
News September 20, 2025
ఎర్లీ మెనోపాజ్‌లో ఏం తినాలంటే..

ప్రతి మహిళకు మెనోపాజ్ సాధారణం. అయితే కొందరికి హార్మోన్ల ప్రభావం వల్ల ఎర్లీ మెనోపాజ్ వస్తుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టిరాన్ పెరుగుతుంది. దీంతో జీవక్రియ సమస్యలు, థైరాయిడ్, మధుమేహం వచ్చే అవకాశాలుంటాయి. బరువు పెరుగుతారు. ఇలా కాకుండా ఉండాలంటే రాగి, జొన్నజావలు తీసుకోవాలి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉండే కూరగాయలు, పండ్లు, నట్స్ తినాలి. ప్రాసెసింగ్ ఫుడ్స్, చాక్లెట్లు, జంక్ ఫుడ్ తగ్గించాలి.