News January 16, 2025
మన స్టార్ క్రికెటర్లు చివరిగా రంజీలు ఎప్పుడు ఆడారంటే?

జూనియర్, సీనియర్ తేడా లేకుండా క్రికెటర్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని BCCI స్పష్టం చేసింది. దీంతో కొందరు రంజీలకు సిద్ధమవగా, మరికొందరు ఇంకా స్పందించలేదు. ఈ క్రమంలో మన స్టార్ క్రికెటర్లు చివరిసారిగా రంజీ మ్యాచ్‌లు ఎప్పుడు ఆడారో తెలుసుకుందాం. కోహ్లీ(DEL)-2012, రోహిత్(MUM)-2015, బుమ్రా(GUJ)-2017, పంత్(DEL)-2018, రాహుల్(KAR)-2020, జడేజా(SAU)-2023.
Similar News
News December 6, 2025
ఆదిలాబాద్: అప్పు ఎంతైనా పర్వాలేదు.. గెలవాలంతే!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 11, 14, 17వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ తేదీలు దగ్గర పడుతున్న కొద్ది జిల్లాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పలు పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కాసుల వేట కొనసాగిస్తున్నారు. ఎక్కువ అభ్యర్థులు పోటీ చేసే జనరల్ స్థానాల్లో ఈ ధోరణి తారస్థాయిలో ఉంది. కొంతమంది అభ్యర్థులు అయితే తమ వద్ద డబ్బులు లేక అప్పులు చేసి మరి ఖర్చు పెడుతున్నారు.
News December 6, 2025
TODAY HEADLINES

* గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్
* రష్యా ఎప్పటినుంచో మిత్రదేశం: మోదీ
* ముగిసిన పుతిన్ పర్యటన.. కీలక ఒప్పందాలు
* 1000 ఇండిగో సర్వీసులు రద్దు.. CEO సారీ
* వినూత్న విద్యతోనే పిల్లల భవిష్యత్: CBN
* DEC 30, 31, JAN 1వ తేదీల్లో సాధారణ దర్శనాలు రద్దు: TTD
* ఇందిరమ్మ ఇల్లులేని ఊరు లేదు: రేవంత్
* ‘హిల్ట్’ కేసు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
* అఖండ-2 సినిమా విడుదల వాయిదా
News December 6, 2025
త్వరలో అఖండ-2 మూవీ కొత్త రిలీజ్ డేట్

బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తెరకెక్కిన <<18465729>>అఖండ-2<<>> చిత్రం రిలీజ్ ఆలస్యమైన విషయం తెలిసిందే. రేపైనా సినిమా విడుదలవుతుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. ‘సినిమాని విడుదల చేసేందుకు చాలా కష్టపడ్డాం. కానీ సాధ్యం కాలేదు. ఫ్యాన్స్, మూవీ లవర్స్ మమ్మల్ని క్షమించాలి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని ట్వీట్ చేసింది.


