News March 25, 2024
ఆర్టీసీలో 3వేల ఉద్యోగాల భర్తీ ఎప్పుడంటే?

TG: లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆర్టీసీలో 3వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహాలక్ష్మి పథకంతో RTCకి పూర్వవైభవం తీసుకొచ్చామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని కోరారు. అవినీతి పునాదులపై నిర్మించిన బీఆర్ఎస్ 100 రోజుల్లోనే కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు. అన్ని మతాలను, కులాలను కాంగ్రెస్ గౌరవిస్తోందన్నారు.
Similar News
News February 1, 2026
‘సింగరేణి’ పై కమిటీ నివేదిక అందింది: కిషన్ రెడ్డి

TG: సింగరేణి కాలరీస్ కంపెనీ వ్యవహారాలపై అధికారుల కమిటీ నివేదిక అందిందని బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దీనిని పరిశీలించాల్సి ఉందని ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. గత BRS ప్రభుత్వ హయాంలోనే సింగరేణిలో ఎక్కువ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ₹51000 CR సంస్థకు బకాయి పడిందని చెప్పారు. కాగా నైనీ బొగ్గు గనుల టెండర్లు, CSR నిధులపై వివాదం నెలకొనడం తెలిసిందే.
News February 1, 2026
పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై 58 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా 252 రన్స్ చేయగా, పాక్ 194 పరుగులకే ఆలౌటైంది. ఆయుశ్ మాత్రే, ఖిలాన్ చెరో 3 వికెట్లు, అంబరీశ్, హెనిల్, చౌహాన్, విహాన్ తలో వికెట్ చేశారు. ఈ గెలుపుతో ఆయుశ్ సేన జైత్ర యాత్రను కొనసాగిస్తూ సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
News February 1, 2026
పార్టీ ఫండ్ నుంచి ఆ పరికరాలు కొన్నారా: KCRను ప్రశ్నించిన సిట్!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ పలు ప్రశ్నలు వేస్తూ KCRను విచారించినట్లు సమాచారం. ‘ప్రభాకర్ రావు సర్వీసును ఎందుకు పొడిగించారు? ఆయనకే 2 పోస్టులెందుకు ఇచ్చారు? ట్యాపింగ్ పరికరాలకు పార్టీ నిధులు వాడారా?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. BRSకు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిన వారి పేర్లు ట్యాపింగ్ లిస్టులో ఎందుకు ఉన్నాయంటూ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన ముందు పెట్టినట్లు తెలుస్తోంది.


