News June 5, 2024
చంద్రబాబు ప్రమాణస్వీకారం ఎప్పుడంటే?

ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. తొలుత ఈ నెల 9నే ప్రమాణం చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అటు ఈ నెల 9న ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో కేంద్ర మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనుంది.
Similar News
News March 18, 2026
గ్రూప్-2లో పోస్టుల సంఖ్యను పెంచాలి: చిరంజీవి

AP: గ్రూప్-2 నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య పెంచాలని MLC వేపాడ చిరంజీవి సీఎస్ సాయిప్రసాద్‌ను కోరారు. నిరుద్యోగుల సమస్యలపై CSకు వినతిపత్రం సమర్పించారు. గ్రూప్-2లో డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు చేర్చాలని, జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కోరారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా జాబ్ క్యాలెండర్లో దాదాపు 600 గ్రూప్-1, 2 పోస్టులు ఉంటాయని సమాచారం.
News March 18, 2026
ఈ గ్రామంలో ఉన్నట్టుండి నిద్రపోతారు!

కజకిస్థాన్‌లోని కలాచి అనే గ్రామంలో ప్రజలు ఎప్పుడు, ఎలా నిద్రపోతారో ఎవరికీ తెలియదు. నడుస్తున్నా, మాట్లాడుతున్నా సరే ఒక్కసారిగా గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఎవరూ లేపకపోతే రోజుల తరబడి పడుకుండిపోతారు. అందుకే దీనిని ‘స్లీపీ హలో’ అని పిలుస్తారు. సమీపంలోని పాత యురేనియం గనుల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఈ వ్యాధి వచ్చిందని భావిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 18, 2026
మరికొన్ని గంటల్లో విధ్వంసం.. ఇరాన్ హెచ్చరిక

మరికొన్ని గంటల్లో గల్ఫ్ దేశాల్లోని పెట్రోకెమికల్ ఫెసిలిటీస్‌పై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. సౌదీలోని జుబైల్, సమ్రెఫ్, ఖతర్‌లోని మిసాయిద్, రస్ లఫాన్ రిఫైనరీ, యూఏఈలోని అల్-హసన్ గ్యాస్ ఫెసిలిటీలపై అటాక్ చేస్తామని శాటిలైట్ ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ 3 దేశాల్లోని ఆయా ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు, ప్రజలు అక్కడి నుంచి వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది.


