News July 16, 2024
OTTలోకి ‘కల్కి’ మూవీ ఎప్పుడు వస్తుందంటే?

ప్రభాస్ ‘కల్కీ2898AD’ మూవీ OTTలో ఎప్పుడొస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్‌లో విడుదలై 10 వారాలు పూర్తైన తర్వాతే OTTలో విడుదల చేసేలా ఒప్పందం జరిగిందట. దీని ప్రకారం సెప్టెంబర్ 2వ వారంలో స్ట్రీమింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. అమెజాన్ ప్రైమ్ OTT రైట్స్ దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1000కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది.
Similar News
News February 8, 2026
పాక్ ఏజెంట్‌తో గొగొయ్‌కి సంబంధాలు: CM

కాంగ్రెస్ MP గౌరవ్ గొగొయ్‌పై అస్సాం CM హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘పాక్ ఏజెంట్ అలీ తౌఖీర్‌తో గౌరవ్ గొగొయ్, ఆయన భార్య ఎలిజబెత్(బ్రిటిష్ పౌరురాలు)కి సంబంధాలున్నాయి. 44పేజీల SIT నివేదిక ప్రకారం ఆమె కీలక సమాచారం పంచుకున్నట్లు ఉంది. పాక్‌కు చెందిన ఓ సంస్థ ఆమెకు జీతమిచ్చింది. గొగొయ్‌తో వివాహమయ్యాక ఆమె 9సార్లు పాక్ వెళ్లారు. గౌరవ్ కుటుంబంలో మరొకరు పాక్‌కు సహకరిస్తున్నారు’ అని ఆరోపించారు.
News February 8, 2026
‘సూపర్ హ్యూమన్స్’ని సృష్టించాలన్న ఎప్‌స్టీన్!

సెక్స్ ట్రాఫికర్ ఎప్‌స్టీన్ ఓ ‘సూపర్ హ్యూమన్ రేస్’ను సృష్టించాలని ప్రయత్నించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. “మరణానికి ముందు తన వింత కోరికను వెలిబుచ్చారు. తన DNAతో గొప్ప మేధస్సు కలిగిన పిల్లలను పుట్టించాలని కోరారు. గతంలోనూ న్యూమెక్సికోలోని తన పెద్ద పశువుల పాక(RANCH)లో మహిళలను గర్భవతులను చేయాలని శాస్త్రవేత్తలతో తరచూ చెప్పేవారు. కొందరు దానిని ‘BABY RANCH’ అని పిలిచేవారు” అని NYT పేర్కొంది.
News February 8, 2026
YS జగన్‌తో TVK విజయ్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, తమిళ సినీ హీరో, టీవీకే అధినేత విజయ్ చెన్నైలో జరిగిన వెడ్డింగ్ ఈవెంట్‌లో కలిశారు. జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి పెళ్లి వేడుకకు విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ పక్కపక్కన కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


