News April 14, 2025

సూర్య ‘రెట్రో’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

image

కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న మూవీ రెట్రో. టీజర్‌తోనే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న మూవీ ట్రైలర్‌ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్, ట్రైలర్ రిలీజ్ అదేరోజు జరగనుంది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ మే 1న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Similar News

News December 8, 2025

నెల్లూరు: హత్య కేసులో ఏడుగురు ముద్దాయిలకు జీవిత ఖైదు

image

అనంతసాగరం (M) పడమటి కంభంపాడులో 2014లో పంచాయతీ కుళాయి వద్ద జరిగిన హత్య కేసులో ఏడుగురు ముద్దాయిలకు జీవిత ఖైదుతో పాటు, ఒక్కొక్కరికి రూ.5 వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు 8th ADJ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సింగమల రమణమ్మ హత్య కేసులో వద్దిబోయిన వెంకటేశ్వర్లు, రత్నయ్య, సుబ్బారెడ్డి, సుధాకర్ రెడ్డి, కేసరి వెంకటేశ్వర్లు, కలువాయి యర్రారెడ్డి, నాగులకంటి రమణారెడ్డికి శిక్ష ఖరారు చేశారు.

News December 8, 2025

విదేశాల్లో వాస్తు పాటిస్తారా?

image

‘వాస్తు నియమాలు నిర్ధిష్ట ప్రాంతానికి పరిమితం కాదు. ప్రపంచంలో ఎక్కడ నివసించినా, వ్యక్తిగత అలవాట్లు వేర్వేరుగా ఉన్నా, పంచభూతాల నియమాలు ఎవరూ విస్మరించలేరు. ప్రపంచంలో వాస్తు సూత్రాలను నిర్లక్ష్యం చేస్తే అది జీవన మనుగడకే ముప్పుగా మారొచ్చు. వాస్తును ప్రాంతాల వారీగా విభజించడం, ఓ ప్రాంతానికే పరిమితం చేయడం అపోహ మాత్రమే. ఈ నియమాలు విశ్వమంతటా పాటించదగినవి’ అని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు.

News December 8, 2025

గ్లోబల్ సమ్మిట్.. తొలిరోజు పెట్టుబడుల వెల్లువ

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో తొలిరోజు పెట్టుబడులు వెల్లువెత్తాయి. రూ.1.88 లక్షల కోట్లకు సంబంధించిన 35 ఒప్పందాలు కుదిరాయి. రంగాల వారీగా ఆ వివరాలు ఇలా..
* డీప్ టెక్, ఫ్యూచర్ సిటీ&కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్- రూ.1,04,000 కోట్లు
* రెన్యూవబుల్ ఎనర్జీ&పవర్ సెక్యూరిటీ- రూ.39,700 కోట్లు
* ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్- రూ.19,350 కోట్లు
* అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ – రూ.13,500 కోట్లు