News April 12, 2025

టెట్ దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

image

TG: ఈ నెల 15 నుంచి 30 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1,000 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించింది. జూన్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. అదే నెల 15-30 మధ్య రోజుకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలు జులై 22న వెల్లడిస్తారు.

Similar News

News December 12, 2025

రెండో విడతలోనూ పై‘చేయి’కి కసరత్తు

image

TG: నిన్న ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. 2,200+ స్థానాల్లో గెలిచారు. బీఆర్ఎస్ 1,100+, బీజేపీ 180+ స్థానాల్లో విజయం సాధించారు. తొలి విడతలో చూపిన జోరునే ఈ నెల 14న జరిగే రెండో విడత పోలింగ్‌లోనూ కొనసాగించాలని హస్తం పార్టీ కసరత్తు చేస్తోంది. 4,332 పంచాయతీలు, 38,322 వార్డులకు ఆ రోజు ఎన్నికలు జరగనున్నాయి.

News December 12, 2025

IIM రాంచీలో నాన్ టీచింగ్ పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ రాంచీలో 5 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, LLB, M.Phil/MA క్లినికల్ సైకాలజీ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://iimranchi.ac.in

News December 12, 2025

18 మెట్లు.. 18 దేవతల ఆశీర్వాదం

image

అయ్యప్ప దర్శనార్థం శబరిలో 18 మెట్లు ఎక్కిన భక్తులు 18 దేవతల ఆశీస్సులు పొందుతారని, వారి జీవితంలోని కష్టాలు పోతాయని నమ్మకం. ఆ 18 మంది దేవతలు వీరే: 1.మహంకాళి 2.కళింకాళి 3.భైరవ 4.సుబ్రహ్మణ్యం 5.గంధర్వరాజ 6.కార్తవీర్య 7.క్రిష్ణ పింగళ 8.భేతాళ 9.మహిషాసుర మర్దని 10.నాగరాజ 11.రేణుకా పరమేశ్వరి 12.హిడింబ 13.కర్ణ వైశాఖ 14.అన్నపూర్ణేశ్వరి 15.పుళిందిని 16.స్వప్న వారాహి 17.ప్రత్యంగళి 18.నాగ యక్షిణి. <<-se>>#AyyappaMala<<>>