News March 18, 2024
టెట్ ఫలితాల విడుదల ఎప్పుడు?

AP: గత నెలలో నిర్వహించిన ‘టెట్’ ఫలితాలు ఈ నెల 14నే విడుదల కావాల్సి ఉండగా ఇప్పటి వరకు అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టెట్ను విడతలవారీగా నిర్వహించినందున మార్కులను నార్మలైజేషన్ చేయాల్సి ఉండటంతో ఆలస్యం అయినట్లు సమాచారం. టెట్లో అర్హత సాధిస్తేనే DSCకి అర్హులవుతారు. అలాగే టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. ఈ నెల 30 నుంచి డీఎస్సీ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.
Similar News
News March 29, 2025
డెబ్యూలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. చరిత్ర సృష్టించాడు

పాక్తో జరిగిన తొలి వన్డేలో కివీస్ ప్లేయర్ మహమ్మద్ అబ్బాస్ చరిత్ర సృష్టించారు. డెబ్యూ మ్యాచ్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ(26 బంతుల్లో 52) చేసిన ప్లేయర్గా నిలిచారు. ఇందులో 3 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. అలాగే 7 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ కూడా తీశారు. కాగా 5 టీ20ల సిరీస్ను 4-1తో కోల్పోయిన పాక్, 3 వన్డేల సిరీస్ తొలి మ్యాచ్లో 73 పరుగుల తేడాతో ఓడిపోయింది.
News March 29, 2025
వివేకా హత్య కేసు నిందితులకు త్వరలో సినిమా: ఆదినారాయణ రెడ్డి

AP: వివేకా హత్య కేసులో CBI మళ్లీ దర్యాప్తు ప్రారంభిస్తుందని MLA ఆదినారాయణ రెడ్డి అన్నారు. దీంతో ఆ కేసులోని నిందితులకు త్వరలోనే సినిమా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లో MP అవినాశ్ పాత్రే ఎక్కువగా ఉందని తెలిపారు. మరోవైపు, తనకు YCP నేతల నుంచి ప్రాణహాని ఉందని ఇదే కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఇవాళ కడపలో వాపోయారు.
News March 29, 2025
రోడ్డు ప్రమాదం.. IPS అధికారి దుర్మరణం

TG: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వారిలో మహారాష్ట్రకు చెందిన సుధాకర్ పటేల్ అనే ఐపీఎస్ అధికారి ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కాగా వీరంతా మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.