News August 6, 2025
భారత్‌పై 50% టారిఫ్స్.. అమల్లోకి ఎప్పటినుంచంటే?

ఇటీవల భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 25శాతం సుంకాలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని వైట్‌హౌస్ తెలిపింది. తాజాగా విధించిన 25శాతం అదనపు టారిఫ్‌లు 21 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 50శాతం సుంకాలు వర్తించనున్నాయి. ఫలితంగా ఆసియాలో చైనా(51శాతం) తర్వాత అత్యధిక టారిఫ్‌లు ఎదుర్కొంటున్న దేశం భారతే కానుంది.
Similar News
News August 7, 2025
ఇన్‌స్టాగ్రామ్‌లో 3 కొత్త ఫీచర్స్

ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. పబ్లిక్‌గా ఉన్న రీల్స్, ఫీడ్ పోస్టులను రీపోస్ట్ చేసే ఆప్షన్‌ను తీసుకొచ్చారు. అలాగే యూజర్ తన ప్రజెంట్ లొకేషన్‌ను ఫ్రెండ్స్‌కు షేర్ చేసేలా ‘మ్యాప్’ ఫీచర్ తీసుకొచ్చారు. ఫ్రెండ్స్ లైక్ & కామెంట్ లేదా రీపోస్ట్ చేసిన రీల్స్ చూసేందుకు ‘ఫ్రెండ్స్’ అనే ట్యాబ్ తీసుకొచ్చారు. మూడు ఫీచర్లు క్రమంగా అందరికీ అందుబాటులోకి రానున్నాయి.
News August 7, 2025
BCCIకి ఊరట.. RTI నుంచి మినహాయింపు!

భారత క్రికెట్ బోర్డు(BCCI)ని ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును కేంద్రం రూపొందించిన విషయం తెలిసిందే. అయితే సమాచార హక్కు చట్టం(RTI) నుంచి బోర్డుకు మినహాయింపు లభించినట్లు తెలిసింది. కేవలం ప్రభుత్వ నిధులతో నడిచే స్పోర్ట్స్ ఫెడరేషన్లకు మాత్రమే RTI వర్తించేలా బిల్లును సవరించినట్లు సమాచారం. దీని ప్రకారం ప్రభుత్వ నిధులపై ఆధారపడని BCCI RTI పరిధిలోకి రాదని తెలుస్తోంది.
News August 7, 2025
ఈవీఎం OR బ్యాలెట్.. ఏ పద్ధతి కావాలి?

ఎన్నికల్లో EVMల ట్యాంపరింగ్ జరుగుతోందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. అంచనాలకు అందని విధంగా ఫలితాలు వస్తున్నాయని LoP రాహుల్ గాంధీ అంటున్నారు. EVMలు వద్దని, మళ్లీ బ్యాలెట్ పద్ధతి తేవాలని KTR ఇటీవల డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు BJP ఖండిస్తుండగా.. EVMలను ట్యాంపర్ చేయడం అసాధ్యమని EC కుండబద్దలు కొడుతోంది. ఓటర్లుగా మీరు ఏ విధానం కావాలని కోరుకుంటున్నారు? కామెంట్ చేయండి.