News April 3, 2025
ఇంకెప్పుడు మంత్రివర్గ విస్తరణ?

TG: మంత్రివర్గ విస్తరణ ప్రహసనంగా మారిపోయింది. GOVT ఏర్పడి ఏడాదిన్నర దాటినా, ఎన్నోసార్లు CM ఢిల్లీకి వెళ్లొచ్చినా అడుగు ముందుకు పడట్లేదు. తాజాగా APR 3, 4వ తేదీల్లో ప్రమాణ స్వీకారమంటూ వచ్చిన వార్తలు గాల్లో కలిసిపోయాయి. 6 బెర్తుల కోసం ఆశావహులు కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇలా ఆలస్యం చేయడంతో పార్టీపరంగా నష్టమే ఎక్కువని, ప్రజల్లోనూ చులకనయ్యే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. మీరేమంటారు?
Similar News
News December 28, 2025
కొత్తగా 784 మంది స్పెషాలిటీ వైద్యులు: సత్యకుమార్

AP: సెకండరీ/టీచింగ్ ఆస్పత్రులకు కొత్తగా 784 మంది PG వైద్యులు(సీనియర్ రెసిడెంట్స్) జనవరి 1 నుంచి రాబోతున్నారని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఇటీవల PG పూర్తి చేసిన వారికి పోస్టింగులు ఇస్తున్నట్లు చెప్పారు. నోటిఫికేషన్ జారీ చేశామని, ఈ నెల 29 వరకు ఆప్షన్ల నమోదు కొనసాగుతుందని చెప్పారు. వీరు 6 నెలలు బోధనాసుపత్రుల్లో, మరో 6 నెలలు సెకండరీ ఆసుపత్రుల్లో తప్పకుండా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
News December 28, 2025
టీమ్ ఇండియాకు కొత్త కోచ్?

న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో టెస్టుల్లో IND ఘోరంగా ఓడిపోవడంతో కోచ్ గంభీర్‌పై విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో ఆయనను టెస్ట్ కోచ్ పదవి నుంచి తప్పించాలని BCCI భావిస్తోందని వార్తలొస్తున్నాయి. ఆయన స్థానంలో సొగసరి బ్యాటర్, తెలుగు క్రికెటర్ VVS లక్ష్మణ్‌ను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయనను సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం లక్ష్మణ్ BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పనిచేస్తున్నారు.
News December 27, 2025
ఇరిగేషన్ శాఖ సలహాదారుపై BRS గురి!

TG: అసెంబ్లీలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు ముందు ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌పై BRS గురిపెట్టింది. 2014-19 మధ్య CBN పాలనలో AP నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన ఈ ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసి పనులను నిలిపివేశారని BRS ఆరోపిస్తోంది. దీంతో కౌంటర్ ఇచ్చేందుకు CM రేవంత్, మంత్రి ఉత్తమ్ సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టును నిలిపివేయడంలో ఆదిత్యనాథ్ పాత్రపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.


