News August 20, 2024
డీఎస్సీ ఫలితాలు ఎప్పుడంటే?

TG: డీఎస్సీ ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇటీవల 11,062 పోస్టులకు నిర్వహించిన పరీక్షలకు 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటికే రెస్పాన్స్ షీట్లతో పాటు ప్రిలిమినరీ కీని విడుదల చేయగా నేటితో అభ్యంతరాల స్వీకరణ ముగియనుంది. వచ్చే నెల రెండో వారంలో మెరిట్ లిస్ట్ 1:3 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News January 3, 2026
జీర్ణశక్తిని పెంచే ఫ్రూట్స్ ఇవే..

శీతాకాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఫైబర్, ఎంజైమ్స్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి. నారింజ, కివి, దానిమ్మ, బొప్పాయి, జామపండు శీతాకాలంలో ఎక్కువగా తినాలి. ఇవి మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం తగ్గించడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అలాగే గ్రేప్ ఫ్రూట్, బెర్రీలు, బెర్రీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శీతాకాలంలో బరువు పెరగకుండా నిరోధిస్తాయంటున్నారు నిపుణులు.
News January 3, 2026
కాల్స్, మెసేజ్‌లు వేరేవాళ్లకు వెళ్తున్నాయా? ఇలా చెక్ చేసి ఆపేయండి!

‘అన్‌కండిషనల్ కాల్ ఫార్వర్డింగ్’ ద్వారా హ్యాకర్లు మీ కాల్స్, SMS, OTPలను వారి నంబర్‌కు మళ్లించే ప్రమాదం ఉంది. మొబైల్లో *#21# డయల్ చేస్తే మీ స్క్రీన్‌పై ఒక లిస్ట్ కనిపిస్తుంది. అందులో వాయిస్, డేటా, SMS వంటి వాటి పక్కన Not Forwarded అని ఉంటే మీ ఫోన్ సేఫ్. ఒకవేళ ఏదైనా నంబర్ కనిపిస్తే మీ సమాచారం లీక్ అవుతున్నట్టే. ఫార్వర్డ్ అవుతున్నాయని గుర్తిస్తే ##002# డయల్ చేసి అన్ని సెట్టింగ్‌లను రద్దు చేయొచ్చు.
News January 3, 2026
BSFలో 549 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<


