News February 14, 2025

IPLలో తొలి మ్యాచ్ ఎప్పుడు, ఎవరి మధ్య..?

image

ఈ ఏడాది IPL షెడ్యూల్‌కు సంబంధించిన కీలక వివరాలను క్రిక్‌బజ్ వెబ్‌సైట్ వెల్లడించింది. ‘బీసీసీఐ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో మార్చి 22న(శనివారం) కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరగనుంది. గత ఏడాది రన్నరప్ టీమ్ సన్‌రైజర్స్ తర్వాతి రోజు మధ్యాహ్నం ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్ మీద తలపడనుంది. ఇక మే 25న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది’ అని పేర్కొంది.

Similar News

News February 14, 2025

రెసిప్రోకల్ సుంకాలను వసూలు చేస్తాం: ట్రంప్

image

ఇతర దేశాల నుంచి రెసిప్రోకల్ (పరస్పర) సుంకాలను వసూలు చేయాలని నిర్ణయించినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. US నుంచి ఆయా దేశాలు ఎంత వసూలు చేస్తే తామూ అంతే వసూలు చేస్తామని వెల్లడించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ ఎక్కువ టారిఫ్స్ వసూలు చేస్తోందని తెలిపారు. తాము కూడా భారత్‌ నుంచి అంతే వసూలు చేస్తున్నామని చెప్పారు.

News February 14, 2025

స్టొయినిస్‌పై ఆరోన్ ఫించ్ మండిపాటు

image

ఆస్ట్రేలియా క్రికెటర్ స్టొయినిస్ ODIల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విధానంపై మాజీ క్రికెటర్ ఫించ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రిటైర్మెంట్ నిర్ణయం కచ్చితంగా అతడి ఇష్టం. ఎవరూ తప్పుబట్టరు. కానీ తనపై నమ్మకంతో సెలక్టర్లు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారు. మరి అతడు బాధ్యతగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ముందుగానే చెప్పాలి కదా? అది కచ్చితంగా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమైతే కాదు’ అని వ్యాఖ్యానించారు.

News February 14, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

error: Content is protected !!