News January 11, 2025

CTకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే?

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు భారత జట్టు ప్రకటన ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12లోపు అనౌన్స్ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు BCCI ఎలాంటి ప్రకటన చేయలేదు. ICCని గడువు పొడిగించాలని అభ్యర్థించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18 లేదా 19న జట్టు ప్రకటన ఉంటుందని సమాచారం. CTతో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న T20, వన్డేలకు జట్లను ప్రకటించలేదు. అయితే, రెండ్రోజుల్లో T20 జట్టును ప్రకటిస్తారని క్రీడావర్గాలు చెబుతున్నాయి.

Similar News

News January 11, 2025

సంక్రాంతి.. ఇలా ట్రాఫిక్ జామ్ తప్పించుకోండి!

image

HYD నుంచి విజయవాడ వైపుకి వెళ్లే వారికి పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారు. పెద్ద అంబర్ పేట్ నుంచి చౌటుప్పల్ మీదుగా చిట్యాల వరకు వాహనాల రద్దీ ఉందని చెప్పారు. ఆ మార్గంలో వెళ్లకుండా ఘట్కేసర్ (ఎగ్జిట్-9) నుంచి భువనగిరి-వలిగొండ-రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవచ్చని తెలిపారు. అలాగే గుంటూరు వైపు వెళ్లేవారు బొంగులూరు (ఎగ్జిట్-12) గేటు నుంచి ఇబ్రహీంపట్నం-మాల్-దేవరకొండ మీదుగా వెళ్లాలని సూచించారు.

News January 11, 2025

వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తాం: CM

image

AP: స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు CM చంద్రబాబు తెలిపారు. ప్రథమ స్వాతంత్ర్య పోరాటంగా పరిగణించే సిపాయిల తిరుగుబాటుకు(1857) ముందే 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి ఓబన్న ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని వీరగాథను స్మరించుకుందామన్నారు.

News January 11, 2025

వెలుగులోకి కొత్త మోసం.. ప్రెగ్నెంట్ చేస్తే ₹10లక్షలు!

image

‘ప్రెగ్నెంట్ సర్వీస్’ పేరిట బిహార్‌లోని నవాదా జిల్లాలో ఓ ముఠా స్కామ్‌కు తెరలేపింది. పిల్లల్లేని మహిళల్ని గర్భవతులను చేస్తే ₹10లక్షలు, ప్రెగ్నెంట్ చేయడంలో విఫలమైనా ₹50,000-₹5L ఇస్తామని ఆ ముఠా సభ్యులు పలువురిని నమ్మించారు. ఆధార్, పాన్, ఫొటోలు తీసుకుని రిజిస్ట్రేషన్, హోటల్ బుకింగ్స్ పేరిట డబ్బులు వసూలు చేశారు. ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ చేసేవారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.