News March 7, 2025
చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ ఎప్పుడంటే?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించబోయే సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. అక్టోబర్ కల్లా షూటింగ్‌ను పూర్తి చేసి 2026 సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం చిరంజీవి 90 రోజులు డేట్స్ ఇచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News April 3, 2026
ఐరన్ టాబ్లెట్లు ఎప్పుడు తీసుకోవాలంటే

ఐరన్ లోపించినప్పుడు, శరీరం అవసరం మేరకు ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేదు. దీనివల్ల కణజాలాలకు, అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందదు. దీనికోసం ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. వీటిని పరగడపున తీసుకుంటే చక్కగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఐరన్‌తో పాటు వేరే మందులు తీసుకోవద్దు. ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న గంట వరకూ డెయిరీ ప్రోడక్ట్స్ అయిన పాలు, పెరుగు వంటివి తీసుకోకూడదని చెబుతున్నారు.
News April 3, 2026
ఏ దేశ ప్రజలకు ఎక్కువ సెక్స్ పార్ట్‌నర్స్ ఉన్నారంటే?

అత్యధిక లైంగిక భాగస్వాములను కలిగిన దేశాల లిస్ట్‌లో తుర్కియే టాప్‌లో ఉంది. ఇక్కడి పౌరుల లైంగిక భాగస్వాముల సగటు 14.5గా ఉన్నట్లు వరల్డ్ పాపులేషన్ రివ్యూ చెబుతోంది. తుర్కియే తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా (13.3), న్యూజిలాండ్ (13.2), ఐస్‌లాండ్ (13.0), సౌతాఫ్రికా (12.5) ఉన్నాయి. ఇక అతితక్కువ సెక్స్ పార్ట్‌నర్స్ కలిగిన దేశంగా భారత్(3) నిలిచింది.
News April 3, 2026
అమ్మోరు/మశూచి వ్యాధిని కోళ్లలో ఇలా గుర్తించండి

మశూచి వ్యాధి సోకిన కోళ్ల ముక్కు, ముఖం, కంటి రెప్పలు, దవడల పైన బొబ్బలు వచ్చి ముక్కు నుంచి, కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. ఇది తక్కువ వ్యవధిలో ఇతర కోళ్లకు వ్యాపిస్తుంది. దీని వల్ల కోళ్ల మరణాలు తక్కువే ఉన్నప్పటికీ.. సరిగా మేత, నీరు తీసుకోలేవు. గుడ్లు పెట్టడం ఆగిపోతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. చర్మంపై కురుపుల్లో ఇతర సూక్ష్మక్రిములు చేరకుండా ఉండేందుకు పసుపు, వేపనూనె మిశ్రమాన్ని పూతగా పూయాలి.


