News September 12, 2024

నీ ఇంటికి వచ్చా.. దమ్ముంటే బయటకు రా: గాంధీ

image

TG: BRS MLA కౌశిక్ రెడ్డికి దమ్ము, ధైర్యముంటే ఇంటి నుంచి బయటకు రావాలని శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీ డిమాండ్ చేశారు. కౌశిక్ ఇంటి ముందు అనుచరులతో కలిసి ఆయన బైఠాయించారు. ‘నా ఇంటికి వచ్చి జెండా ఎగురవేస్తా అన్నావు. నువ్వు రాలేదు. నేనే నీ ఇంటికి వచ్చా. పోలీసులను అడ్డు పెట్టుకొని నువ్వు ఇంట్లో దాక్కున్నావు. తేల్చుకుందాం బయటకు రా. నువ్వు వచ్చే వరకూ ఇక్కడే ఉంటా’ అని గాంధీ తేల్చి చెప్పారు.

Similar News

News February 20, 2026

క్వాంటం కంప్యూటింగ్‌లో APదే పైచేయి.. AI సమ్మిట్‌లో చంద్రబాబు

image

AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొన్న AP CM చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం త్వరలోనే గూగుల్ వంటి సంస్థల రాకతో గ్లోబల్ AI డేటా హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్మిస్తున్న క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచమంతా మాట్లాడుకునే రోజు వస్తుందన్నారు. ప్రపంచానికి అవసరమైన క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను APలోనే తయారు చేసేలా ఎకోసిస్టమ్‌ను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

News February 20, 2026

కొన్నాళ్లు వేరుకాపురం ఉండటం మంచిదే..

image

పెళ్లైన తర్వాత కొన్నాళ్లు వేరుకాపురం ఉండటం మంచిదే అంటున్నారు నిపుణులు. దీనివల్ల బంధం దృఢమవ్వడంతో పాటు బాధ్యతలు తెలుస్తాయంటున్నారు. అలాగే ప్రస్తుతం దంపతులిద్దరూ ఉద్యోగం చేస్తుండటంతో కలిసి గడిపే సమయం తగ్గిపోయింది. అదే విడిగా ఉంటే కాస్త సమయమైనా దొరుకుతుందంటున్నారు. అత్తమామలతో అనుబంధం దృఢమయ్యే దాకా విడిగా ఉంటూనే సందర్భం వచ్చినప్పుడు వారితో సమయం గడపాలని సూచిస్తున్నారు.

News February 20, 2026

ఇల్లు తుడిచే నీళ్లలో ఉప్పు ఎందుకు వేయాలి?

image

ఇల్లు తుడిచే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు కలిపితే ఇంట్లోని ప్రతికూల తరంగాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు. ‘ఉప్పులోని రసాయన గుణాలు సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. వాస్తు పరంగా ఇది ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చి, దారిద్ర్యాన్ని పోగొడుతుంది. తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వీలైతే ప్రతిరోజు లేదా కనీసం మంగళ, శుక్రవారాల్లో ఇలా చేయాలి. తద్వారా ఇంట్లో ప్రశాంతత, సంతోషం నెలకొంటాయి’ అంటున్నారు.