News April 13, 2024
నేడు చంద్రబాబు ‘ప్రజాగళం’ సభలు ఎక్కడంటే?

AP: జనసేనాని పవన్‌తో టీడీపీ చీఫ్ చంద్రబాబు ఉమ్మడి ప్రచారానికి కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇవాళ తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో చంద్రబాబు ‘ప్రజాగళం’ సభలు నిర్వహించనున్నారు. రేపు పాయకరావుపేట, చోడవరం, గాజువాకలో, ఈ నెల 15న రాజాం, పలాస, టెక్కలిలో సభలు నిర్వహించనున్నారు. 16, 17న ఇరువురు నేతలు కలిసి ఉమ్మడి ప్రచారం నిర్వహిస్తారు.
Similar News
News March 10, 2026
VIRAL PHOTO: ‘ఫిట్’ మ్యాన్

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌తో ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా వెకేషన్‌లో ఉన్న ఆయన షర్ట్ లెస్ ఫొటోను షేర్ చేయగా వైరలవుతోంది. సిక్స్ ప్యాక్ కోసం హిట్ మ్యాన్ ప్రయత్నిస్తున్నారని, బాడీ చూస్తేనే అర్థమవుతోందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తక్కువ సమయంలోనే అదిరిపోయే ఫిట్‌నెస్ సాధించారని ప్రశంసిస్తున్నారు. కాగా ఈనెల చివర్లో IPL-2026 ప్రారంభంకానుంది.
News March 10, 2026
US-ఇరాన్ పోరు.. LICకి ₹70వేల కోట్లు నష్టం

అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ పోరుతో LIC భారీగా నష్టపోయింది. FEB 27 నాటికి ₹14.88 లక్షలకోట్లుగా ఉన్న ఆ సంస్థ పెట్టుబడులు.. మార్చి 9 నాటికి 4.7% (₹70,105కోట్లు) తగ్గి ₹14.17లక్షల కోట్లకు చేరాయి. ఏస్ ఈక్విటీ సంస్థ డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. కేవలం SBI, HDFC, ICICI బ్యాంక్ స్టాక్స్ క్రాష్ అవడం వల్ల LICకి ఏకంగా ₹15,293కోట్లు (21.8%) లాస్ వచ్చింది. ఇక L&Tలో ఇన్వెస్ట్‌మెంట్ వల్ల ₹7,609కోట్లు నష్టపోయింది.
News March 10, 2026
జాబ్ హగ్గింగ్.. ఏంటిది?

కరోనా తర్వాత ‘క్వైట్ క్విట్టింగ్’, ‘కెరీర్ కుషనింగ్’ వంటి ట్రెండ్స్ చూశాం. ఇప్పుడు ‘జాబ్ హగ్గింగ్’ వంతు. అంటే.. ప్రస్తుత ఉద్యోగంలో సంతృప్తి లేకపోయినా, గ్రోత్ లేకపోయినా.. ఆర్థిక అనిశ్చితి, లేఆఫ్స్ భయంతో ఉన్నా.. దాన్నే గట్టిగా పట్టుకొని ఉండటం. ఇది కంపెనీపై ప్రేమతో చేసేది కాదు. బయట పరిస్థితులు బాగోలేక భద్రత కోసం తీసుకుంటున్న కేర్. కొత్త రిస్క్ తీసుకోవడం కంటే వస్తున్న జీతాన్ని కాపాడుకోవడం అన్నమాట.


