News February 16, 2025
IPL-2025 క్వాలిఫయర్స్, ఎలిమినేటర్ ఎక్కడంటే?

IPL-2025లో కీలక మ్యాచ్లకు HYD, కోల్కతా వేదికలు కానున్నాయి. క్వాలిఫయర్-1 మే 20న, ఎలిమినేటర్ మే 21న HYDలో జరగనున్నాయి. క్వాలిఫయర్-2 మే 23న, ఫైనల్ మే 25న కోల్కతాలో నిర్వహించనున్నారు. క్వాలిఫయర్-1లో గెలిచిన టీం నేరుగా ఫైనల్ చేరనుండగా, ఓడిన టీంకు మరో అవకాశం ఉంటుంది. ఆ జట్టు ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2లో తలపడాలి. మే 25న టైటిల్ విన్నర్ ఎవరో డిసైడ్ అవుతుంది.
Similar News
News December 5, 2025
మోదీ-పుతిన్ నవ్వులు.. ఎక్కడో మండుతున్నట్టుంది!

పుతిన్ భారత పర్యటనతో US అధ్యక్షుడు ట్రంప్కు ‘ఎక్కడో మండుతున్నట్టుంది’ అంటూ ఇండియన్ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ట్రంప్ ఫొటోలతో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మోదీ-పుతిన్ నవ్వులు చూసి ఆయన ఏడుస్తుంటారని పోస్టులు పెడుతున్నారు. టారిఫ్స్ ఇంకా పెంచుతాడేమోనని సెటైర్లు వేస్తున్నారు. రష్యాతో సంబంధాలు పెంచుకున్నామనే అక్కసుతోనే ట్రంప్ మనపై అధిక టారిఫ్స్ విధించిన విషయం తెలిసిందే.
News December 5, 2025
స్క్రబ్ టైఫస్ పట్ల ఆందోళన వద్దు: హెల్త్ కమిషనర్

AP: స్క్రబ్ టైఫస్ జ్వరాల పట్ల ఆందోళన అవసరం లేదని హెల్త్ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. 2023 నుంచి కేసులు నమోదవుతున్నాయని, మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది NOV 30 వరకు 736 స్క్రబ్ టైఫస్ కేసులు రికార్డయినట్టు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. శరీరంపై నల్లమచ్చ కనిపించి జ్వరం, తలనొప్పి వస్తే అలర్ట్ కావాలన్నారు. చిగ్గర్ మైటు అనే పురుగు కుట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పారు.
News December 5, 2025
‘ప్లేస్ నువ్వు చెప్తావా?’.. అచ్చెన్నకు YCP సవాల్

AP: మంత్రి అచ్చెన్నాయుడుకి YCP సవాలు విసిరింది. ‘Xలో ఇలా రంకెలు వేయడమెందుకు అచ్చెన్నాయుడు ప్లేస్ నువ్వు చెప్తావా? మమ్మల్ని చెప్పమంటావా? టైం నువ్వు చెప్తావా? మమ్మల్ని చెప్పమంటావా? నీతో చర్చకు మా పార్టీ నేతలు రెడీ. ఇంతకీ నువ్వు సిద్ధమా? ఈ సారైనా వస్తావా? పారిపోతావా?’ అంటూ ట్వీట్ చేసింది. ‘జగన్ 5 ఏళ్ల మోసపు పాలన vs కూటమి 18 నెలల అభివృద్ధి పాలన’ అంటూ అచ్చెన్నాయుడు చేసిన ట్వీటుపై ఇలా స్పందించింది.


