News November 26, 2024

ఇండియా-ఏ ప్రాక్టీస్ మ్యాచ్‌ ఎక్కడ చూడొచ్చంటే..

image

పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా విక్టరీ జోష్‌లో ఉన్న భారత అభిమానులకు మరో గుడ్ న్యూస్. ఈ నెల 30న కాన్‌బెరాలో ప్రైమ్ మినిస్టర్స్ లెవెన్‌తో ఇండియా-ఏ ఆడే 2రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను కూడా లైవ్ చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్‌లో ఇది టెలికాస్ట్ కానుంది. తొలి మ్యాచ్‌కి దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్‌కు రెండో టెస్టు ముంగిట ఈ ప్రాక్టీస్ కీలకం. రెండో టెస్టు వచ్చే నెల 6న అడిలైడ్‌లో ప్రారంభం కానుంది.

Similar News

News December 3, 2025

రేపే దత్త జయంతి.. ఏం చేయాలంటే?

image

త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయస్వామి. అందుకే ఆయనకు 3 తలలుంటాయి. రేపు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయనను పూజిస్తే.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆరాధనా ఫలితం దక్కుతుందని నమ్మకం. ఆయన చిత్రపటం, విగ్రహానికి పసుపు రంగు పూలతో అలంకరించి, పులిహోరా, నిమ్మకాయలు వంటి పసుపు రంగు నైవేద్యాలు సమర్పిస్తే.. శని బాధలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. ఈ పవిత్రమైన రోజున ఆయన అనుగ్రహం పొందితే జీవితంలో శుభాలు కలుగుతాయి.

News December 3, 2025

భారత్ సిరీస్ పట్టేస్తుందా?

image

IND, SA మధ్య నేడు రాయ్‌పూర్‌లో రెండో వన్డే జరగనుంది. 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్ ఇవాళ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అటు సిరీస్ ఫలితాన్ని 3వ వన్డేకు వాయిదా వేయాలనే పట్టుదలతో సఫారీ జట్టు ఉంది. గాయంతో తొలి వన్డేకు దూరమైన బవుమా జట్టులో చేరే ఆస్కారం ఉంది. రోహిత్, కోహ్లీ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. సుందర్ ప్లేస్‌లో తిలక్ జట్టులోకి రావొచ్చని టాక్. మ్యాచ్ 1.30PMకు మొదలవుతుంది.

News December 3, 2025

సూతకం అంటే మీకు తెలుసా?

image

ఓ ఇంట్లో జననం లేదా మరణం జరిగినప్పుడు పాటించే అశుభ్రత కాలాన్ని సూతకం అంటారు. కొత్త జననం జరిగినప్పుడు శిశువుకు, తల్లికి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరికీ శుద్ధి అయ్యే వరకు జనన సతకం ఉంటుంది. అలాగే, కుటుంబంలో ఎవరైనా మరణిస్తే.. వారి ఆత్మ శాంతించే వరకు కొన్ని రోజుల పాటు మరణ సూతకం పాటిస్తారు. ఈ సూతక కాలంలో ఇంటి సభ్యులు దేవాలయాలకు వెళ్లరు. శుభకార్యాలు, పూజలు వంటివి చేయరు.